Friday, September 20, 2024
Homeఆంధ్రప్రదేశ్Pathikonda: ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేయండి

Pathikonda: ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేయండి

నవరత్నాలు పేద లందరికీ ఇళ్లకు సంబంధించి స్టేజ్ కన్వర్ష న్ లో పురోగతి సాధించడంలో కీలక పాత్ర పోషించాలని మండల స్థాయి అధికారులను కర్నూలు జిల్లా కలెక్టర్ డా.జి.సృజన ఆదేశించారు. పత్తికొండ మండల కేంద్రంలోని నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు పథకంలో భాగంగా పెద్దహుల్తి జగనన్న కాలనీలో చేపడుతున్న ఇళ్ళ నిర్మాణాలను జిల్లా కలెక్టర్ డా.జి.సృజన పురోగతిని పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పత్తికొండ మండల కేంద్రంలోని పెద్దహుల్తిలోని ఇళ్ల నిర్మాణాల పురోగతిపై హౌసింగ్ సిబ్బందిని ఆరా తీయగా లేఅవుట్ లో మొత్తం 121 ఇళ్లు మంజూరు అయ్యాయని వాటిలో బేస్మెంట్ లెవెల్ – 72,రూఫ్ కాంక్రీట్ లెవె ల్ – 11,రూఫ్ లెవెల్ – 04,బిలో బేస్మెంట్ లెవెల్ – 13,పూర్తైన ఇళ్లు – 05 మిగిలనవి 16 ఇంకా మొదలు కాలేదని హౌసింగ్ సిబ్బంది జిల్లా కలెక్టర్ కు వివరించారు. ఇళ్ల నిర్మాణాలకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం చేయడంతో పాటు ఇంటి నిర్మాణానికి అవసర మైన సామగ్రిని తక్కువ ధరకే అందజేసేటప్పుడు ఇళ్ల నిర్మాణాలలో మెరుగైన పురోగతి చూపేలా హౌసింగ్ సిబ్బంది, ఎంపిడిఓ చర్యలు తీసుకోవాలన్నారు. లే అవుట్ లో మంజూరైన 121 లబ్ధిదారులకు సంబంధించి అందరికీ ఆర్థిక సాయం, స్వయం సహాయక సంఘాల ద్వారా ఋణ సదుపాయం అందిందా లేదా అని ప్రతి ఒక్కరి వివరాలు పరిశీలించాలని సచివాలయ సంక్షేమ, ఇంజనీరింగ్ అసిస్టెంట్లు, ఏపిఎం సమన్వయంతో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఇంకా మొదలు కాని, బేస్మెంట్ లెవెల్ లో ఉన్న ఇళ్ల నిర్మాణాలను స్టేజ్ కన్వర్షన్ చేసే దిశగా లబ్ధిదారులను ప్రోత్సహించాల్సిన బాధ్యత ఎంపిడిఓ తీసుకోవాలని, బేస్మెంట్ లెవెల్ నుంచి పూర్తి చేయించే బాధ్యత ఏఈలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. జిల్లా కలెక్టర్ వెంట ఆర్డీఓ మోహన్ దాస్, తహశీల్దార్ విష్ణువ ర్ధన్, ఎంపిడిఓ పార్థసారధి, హౌసింగ్ డి.ఈ గురుప్రసాద్, ఏఈ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News