Sunday, September 8, 2024
Homeఆంధ్రప్రదేశ్Pathikonda: పెండ్లిమాన్ తాండలో 'గడప గడపకు మన ప్రభుత్వం'

Pathikonda: పెండ్లిమాన్ తాండలో ‘గడప గడపకు మన ప్రభుత్వం’

పత్తికొండ మండల పరిధిలోని చందోలి గ్రామ సచివాలయ పరిధిలోని పెండ్లిమంత్ తండా, గిడ్డమ్మ తండా గ్రామాలలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవమ్మ పాల్గొన్నారు. సందర్భంగా జగనన్న ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను కులమతాలకతీతంగా పార్టీలకతీతంగా అమలు చేస్తున్నారని అన్నారు. ప్రజలు లబ్ధి పొందిన కరపత్రాల బుక్లెట్ను లబ్ధిదారులకు అందజేశారు. జగనన్న ప్రభుత్వంలోనే ప్రతి ఇంటికి అన్ని సంక్షేమ పథకాలు అందాయని అన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ జిల్లా అధికార ప్రతినిధి శ్రీరంగడు, ఎంపీపీ నారాయణ దాసు, మండల కన్వీనర్ కారం నాగరాజు, ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షులు భాస్కర్ నాయక్, మండల అధికారులు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, సచివాలయం సిబ్బంది,గ్రామ వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News