Friday, November 22, 2024
Homeఆంధ్రప్రదేశ్Pathikonda: నాయి బ్రాహ్మణులకు వృత్తిరక్షణ చట్టం అమలు చేయాలి

Pathikonda: నాయి బ్రాహ్మణులకు వృత్తిరక్షణ చట్టం అమలు చేయాలి

నాయీ బ్రాహ్మణ కులవృత్తిలో కాలక్రమేణా ఇతర కులాల వాళ్ళు బార్బర్ షాపులు నిర్వహించడం సరైనటువంటి పద్ధతి కాదని, కులములో పుట్టినప్పటి నుండీ వృత్తినే నమ్ముకుని జీవిస్తున్నామని అన్నారు. ఇతర కులాల వారు బార్బర్ షాపులు నిర్వహించడం వలన నాయి బ్రాహ్మణుల కడుపు మీద కొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నాయి బ్రాహ్మణ వృత్తి రక్షణ కోసం ప్రత్యేక వృత్తిరక్షణ చట్టాన్ని ఏర్పాటు చేసి అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. కర్నూలు జిల్లా ఆదోనిలో పట్టణంలో నాయి బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధర్నా కార్యక్రమానికి సంఘీభావం తెలుపుతున్నామని రాబోయే కాలంలో నాయి బ్రాహ్మణలకు వృత్తి రక్షణ చట్టం అమలు చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యక్ష పోరాటాలకు సిద్ధమవుతామని అన్నారు. పత్తికొండ పట్టణంలోని నాయి బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో సంఘం ప్రధాన కార్యదర్శి మల్లికార్జున,ఉపాధ్యక్షులు ఆనంద్ కుమార్,తాయన్న,మాజీ అధ్యక్షులు భాస్కర్,కోశాధికారి రామాంజనేయులు, మాజీ కోశాధికారి తేజ,శ్రీకాంత్,తదితరులు పాల్గొన్నారు.సమావేశంలో మాట్లాడుతున్న నాయి బ్రాహ్మణ రాష్ట్ర అధ్యక్షులు యం.అశోక్ కుమార్ పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News