పత్తికొండ నియోజకవర్గం తాసిల్దార్ ఆఫీస్ కి పనిమీద వచ్చిన దివ్యాంగుడిని నోటికొచ్చినట్టు దూషించారు ఇక్కడి దళారులు. ఇదే ఆఫీసులో పనిచేస్తున్న వీఆర్ఏ గిరిని గేటు తీయమని, తాను దివ్యాంగుడని అడిగిన వ్యక్తిని అనుచిత వ్యాఖ్యలతో అసభ్యంగా దూషించారు. అంతేకాదు దివ్యాంగుడిపై ఏకంగా దాడికి సైతం ప్రయత్నించారు. దీంతో అక్కడున్నవారంతా గిరిని మందలించగా అతను అక్కడినుంచి వెళ్లిపోయాడు. పత్తికొండ ఆర్డీవో ఆఫీసులో, బయట పరిస్థితి నిత్యం ఇలాగే ఉంటుందని పలువురు ఫిర్యాదులు చేస్తున్నా పట్టించుకునే నాథుడే లేడు.
