Thursday, July 4, 2024
Homeఆంధ్రప్రదేశ్Pathikonda: రిలయన్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత పశు వైద్య శిబిరం

Pathikonda: రిలయన్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత పశు వైద్య శిబిరం

రిలయన్స్ ఫౌండేషన్ పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో పత్తికొండ మండల పరిధిలోని పులికొండ గ్రామంలో పశువులకు ఉచిత పశువైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సహాయ సంచాలకులు డాక్టర్ రవి ప్రకాష్ రెడ్డి పశువైద్యాధికారి డాక్టర్ లక్ష్మణ్ పాల్గొని పశువులకు ఉచిత వైద్యం అందించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రవి ప్రకాష్ రెడ్డి రిలయన్స్ ఫౌండేషన్ ప్రాజెక్టు మేనేజర్ మాట్లాడుతూ పశు రైతులు వైద్యుల సూచన మేరకు మినరల్ మిక్షర్ ఇచ్చినట్లు అయితే పశువులు సకాలంలో ఎదకు వచ్చి కట్టు నిలుస్తుంది. రోగ నిరోధక శక్తిని పెంచడానికి ముందుజాగ్రత్తచర్యగా టీకా లువేయించాలి. రైతులు ఎద లక్షణాలు గమనిస్తూ లక్షణాలు కనబడగానే రైతులు ఎద సూదులు పశువులు ఆసుపత్రిలో వేయించుకోవాలని రైతులు పశువులతో పాటు పశువైద్యశాలను సంప్రదించాలని రైతులకు తెలియజేశారు. అలాగే పొదుగు వాపు వ్యాధి లక్షణాలు గురించి, పశువులలో తీసుకోవల్సిన జాగ్రత్తలు గురించి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో 75 పశువులు,155 జీవాలకు వైద్యము అందించారు. రైతులు వాతావరణ వర్షము సమాచారము వ్యవసాయ పశు పోషణ సమాచారం కోసం ఉచిత టోల్ ఫ్రీ నెంబర్ 1800 419 8800 ను సంప్రదించి ఉచిత సలహాలు మరియు సూచనలను పొందవచ్చని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పశువైద్య సిబ్బంది సంపత్, విజయ్, శ్రీను నారాయణ, పులికొండ గ్రామ రైతులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News