Sunday, July 7, 2024
Homeఆంధ్రప్రదేశ్Pawan Kalyan: ప‌వ‌న్ ఎన్నిక‌ల ప్ర‌చార ర‌థం రంగు మార్చాల్సిందేనా?

Pawan Kalyan: ప‌వ‌న్ ఎన్నిక‌ల ప్ర‌చార ర‌థం రంగు మార్చాల్సిందేనా?

Pawan Kalyan: కాదేదీ వివాదానికి అనర్హం అన్నట్లుగా ఉంది జనసేనాని పవన్ కళ్యాణ్ పరిస్థితి. వివాదాలు ఆయనను వెంటాడుతున్నాయో.. లేక ప్రత్యర్ధులు వివాదాన్ని ఆయనకు చుడుతున్నారో తెలియదు కానీ పవన్ ఏం మాట్లాడినా.. ఏం చేసినా తప్పు బట్టేందుకు ప్రత్యర్ధులు సిద్ధంగా ఉన్నారు. జ‌న‌సేన పార్టీని మ‌రింతగా ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళ్లేందుకు రాష్ట్ర వ్యాప్తంగా యాత్ర చేప‌ట్టాల‌ని ప‌వ‌న్ క‌ళ్యాణ్ భావిస్తున్నారు. అందుకోసం ఓ ప్ర‌చార ర‌థాన్ని సిద్దం చేయించారు. ఈ వాహ‌నానికి ‘వారాహి’ అని పేరు పెట్టారు.

- Advertisement -

తాజాగా ‘వారాహి’ ‘ఎన్నిక‌ల యుద్ధానికి సిద్ద‌మైంది’ అంటూ వాహ‌నం మొక్క వీడియోను త‌న ట్విట్ట‌ర్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు. ఈ వాహ‌నంలో హై సెక్యూరిటీ సిస్టమ్‌తో పాటు, జీపీఎస్ ట్రాకింగ్, 360 డిగ్రీల్లో రికార్డ్ చేయగల సీసీటీవీ కెమెరాలు, అత్యాధునిక సౌండ్ సిస్టమ్, రాత్రివేళల్లో సభల కోసం లైటింగ్ సిస్టమ్, ప్ర‌ముఖుల‌తో చ‌ర్చ‌ల‌కు వీలుగా ఒక చిన్న మీటింగ్ రూమ్‌ కూడా ఉంది. అయితే.. పవన్ బండి వారాహీ కలర్ విషయంలో ఇప్పుడు వైసీపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

ఇండియన్ మోటార్ వెహికల్ యాక్ట్‌లో కలర్స్ నిబంధనల్లో.. అలీవ్ గ్రీన్ రంగు మిలటరీ వాహనాలకు తప్ప ఏ ఇతర వాహనాలకూ ఉండకూడదన్న నిబంధన ఉందని చెబుతున్నారు. మిలటరీ రంగు ఉన్న ప్రైవేట్ వాహనాలకు రిజిస్ట్రేషన్ చేయరు. ఆయా వాహనాలను రోడ్డు మీద తిప్పడాన్ని అంగీకరించరు. అందుకే మోటార్ కంపెనీలు ఏవీ అలీవ్ గ్రీన్ కలర్ వాహనాలను అమ్మలేదు. మిలటరీ వాహనాలకు మాత్రమే ఆ కలర్ ఉంటుంది.

కాగా, పవన్ తన వారాహీకి అలీవ్ గ్రీన్ రంగు వేశారు. ఈ కారణంగా రంగు మార్చాల్సిందేనన్న వాదన వినిపిస్తోంది. ఏపీ మాజీ రవాణా మంత్రి పేర్ని నానీ ఇప్పటికే పవన్ వారాహీపై స్పందించి రంగు మార్చాల్సిందేనని చెప్పుకొచ్చారు. ఈ వాహనాన్ని పవన్ రిజిస్టర్ చేశారో తెలియదు కానీ ఒకవేళ అలా చేయాలంటే మాత్రం రంగు మార్చాల్సిందే అంటున్నారు వైసీపీ నేతలు. ఒకవేళ రిజిస్ట్రేషన్ లేకుండా తిప్పితే వైసీపీ దాన్నో పెద్ద వివాదం చేయడం.. అడ్డుకోవడం చేసినా చేస్తుంది. కనుక మరి పవన్ దీనిపై ఎలా స్పందిస్తాడో చూడాలి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News