ఏపీ మంత్రి నారా లోకేశ్(Nara Lokesh) పుట్టినరోజు సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ శ్రేణులు, అభిమానులు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. మరోవైపు సినీ, రాజకీయ ప్రముఖులు కూడా లోకేశ్‌కు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి బర్త్‌డే విషెస్ చెప్పగా.. తాజాగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan Kalyan) సోషల్ మీడియా వేదికగా లోకేష్‌కు బర్త్‌డే విషెస్ తెలిపారు
- Advertisement -
‘ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ మరియు కమ్యూనికేషన్, రియల్ టైమ్ గవర్నెన్స్, మానవ వనరుల శాఖ మంత్రి, సోదరసమానులు లోకేష్‌కి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీరు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ప్రజలకు మరిన్ని సేవలు అందించాలని మనస్ఫూర్తిగా భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను’ అని ట్వీట్ చేశారు.