Pawan Kalyan| మహారాష్ట్ర ఎన్నికల(Maharashtra Elections) ప్రచారంలో జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan Kalyan) పాల్గొననున్నారు. ఎన్డీఏ(NDA) కూటమి అయిన మహాయుతి తరపున ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఈమేరకు పవన్ పర్యటన షెడ్యూల్ విడుదలైంది. ఆ రాష్ట్రంలో తెలుగు ప్రజలు అత్యధికంగా ఉన్న పలు నియోజకవర్గాల్లో ఆయన పర్యటించనున్నారు. ఈనెల 16, 17 తేదీల్లో రెండు రోజుల పాటు పవన్ ఆయా నియోజకవర్గాల్లో ప్రచారం చేయనున్నారు.
కాగా ఇటీవల దేశంలో సనాతన ధర్మం రక్షణపై పవన్ కళ్యాణ్ పోరాటానికి సిద్ధమైన సంగతి తెలిసిందే. హిందువుల మనోభావాలు కాపాడాలంటే సనాతన ధర్మం రక్షణ బోర్డు ఏర్పాటుచేయాలని సూచించారు. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని తెలిపారు. అలాగే తమిళనాడులో సనాతన ధర్మం గురించి డీఎంకే నేత, డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన విషయం విధితమే. దీంతో ఉత్తరాది రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్‌కు యువతలో మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. అందుకే పవన్‌ను కీలకమైన మహారాష్ట్ర ఎన్నికల ప్రచారం బరిలో దింపాలని బీజేపీ పెద్దలు డిసైడ్ అయ్యారు.