HomeTop StoriesPawan kalyan: తమిళనాడు పరిస్థితి వేరు.. ఇక్కడి పరిస్థితి వేరు.. ట్రోల్స్‌పై స్పందించిన పవన్ కళ్యాణ్

Pawan kalyan: తమిళనాడు పరిస్థితి వేరు.. ఇక్కడి పరిస్థితి వేరు.. ట్రోల్స్‌పై స్పందించిన పవన్ కళ్యాణ్

Pawan kalyan Comments on Tamilnadu CM Vijay: ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంచలన కామెంట్స్ చేశారు. తమిళనాడులో నటుడు విజయ్ పార్టీ పెట్టి సీఎం అయిన నేపథ్యంలో, తనపై సోషల్‌ మీడియాలో వస్తున్న విమర్శలు, ట్రోల్స్‌కు ఆయన ధీటుగా బదులిచ్చారు. పక్క రాష్ట్రంలో ఒకరు పార్టీ పెట్టి గెలవగానే.. పవన్ కూడా అలాగే ఒంటరిగా వెళ్లి ఉండాల్సిందని కొందరు సలహాలిస్తున్నారని, కానీ 2019లో నేను ఒంటరిగా పోటీ చేసినప్పుడు నన్ను రెండు చోట్లా ఓడించారని గుర్తు చేశారు. 2019లో ఓటమి అనంతరం ఒక్కొక్కరు పార్టీని వదిలి వెళ్లిపోయారని పవన్ కల్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ శ్రేణులతో జరిగిన సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తమిళనాడు రాజకీయ పరిస్థితులు, ఆంధ్రప్రదేశ్ పరిస్థితులు పూర్తిగా భిన్నమని.. ఒకరిని చూసి మరొకరిని పోల్చడం సరికాదని ఆయన హితవు పలికారు.

- Advertisement -

Also read: NEET paper leak: నీట్‌ పేపర్‌ లీక్‌ వ్యవహారంలో తొలి అరెస్టు.. సీబీఐ విచారణలో సంచలన విషయాలు..!

జనసేన పార్టీకి కార్యకర్తలే బలం..

మరోవైపు, ఇరాన్-అమెరికా యుద్ధం నేపథ్యంలో పెరుగుతున్న ఇంధన ధరల గురించి వైసీపీ చేస్తున్న విమర్శలను పవన్ తిప్పి కొట్టారు. గ్యాస్, పెట్రోల్ ఏమైనా వైసీపీ నేతల ఇంట్లో నుంచి వస్తాయా? ఇరాన్-అమెరికా యుద్ధం వల్ల మనకేం సంబంధం అని అజ్ఞనంతో మాట్లాడుతున్నారు. ప్రపంచ పరిస్థితులపై అవగాహన లేకుండా, అరకొర జ్ఞానంతో వారు చెప్పే మాటలను ఎవరూ నమ్మకూడదని విజ్ఞప్తి చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని తిట్టడం కొందరికి ఫ్యాషన్‌గా మారిపోయిందని ఆయన ధ్వజమెత్తారు. జనసేన పార్టీ భవిష్యత్తు, నిర్మాణంపై నాయకులు, కార్యకర్తలతో పవన్ కల్యాణ్ తన విజన్‌ను పంచుకున్నారు. తన దృష్టిలో కార్యకర్తలే పార్టీకి అసలైన బలమని, వారు అండగా ఉంటేనే పార్టీ నిలబడుతుందని స్పష్టం చేశారు. జనసేన ఎప్పటికీ ఒక కుటుంబ పార్టీగా ఉండకూడదన్నారు. పార్టీ నిర్మాణం అనేది నిరంతర ప్రక్రియగానే జరుగుతుందని వివరించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News