Saturday, November 15, 2025
Homeఆంధ్రప్రదేశ్Pawan Kalyan: పవన్‌ కళ్యాణ్‌ పర్యటనలో అపశ్రుతి.. మహిళ కాలిపై నుంచి దూసుకెళ్లిన కారు

Pawan Kalyan: పవన్‌ కళ్యాణ్‌ పర్యటనలో అపశ్రుతి.. మహిళ కాలిపై నుంచి దూసుకెళ్లిన కారు

Pawan Kalyan Convoy runs over Woman leg: ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముసలిమడుగు పర్యటనలో అపశ్రుతి చోటుచేసుకుంది. చిత్తూరు జిల్లా పలమనేరు సమీపంలోని ముసలిమడుగు వద్ద పవన్ కళ్యాణ్‌ కాన్వాయ్‌ ఓ మహిళ కాలిపై నుంచి దూసుకెళ్లడంతో ఆమెకు గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు. 

- Advertisement -

Also Read: https://teluguprabha.net/andhra-pradesh-news/gummadi-sandhya-rani-cii-summit-north-andhra/

ఆదివారం పవన్‌ కళ్యాణ్‌.. పలమనేరు సమీపంలోని కుంకీ ఏనుగుల క్యాంపు సందర్శన కోసం ముసలిమడుగుకు వెళ్లగా.. అక్కడ ఆయన్ను చూసేందుకు భారీ సంఖ్యలో ప్రజలు, అభిమానులు, స్థానికులు తరలివచ్చారు. రోడ్డుకు ఇరువైపులా క్యూ కట్టడంతో.. రద్దీ కారణంగా తోపులాట జరిగింది. ఈ క్రమంలో ఓ మహిళ కిందపడిపోయింది. ఈ సమయంలో అటువైపుగా వచ్చిన పవన్ కళ్యాణ్ కారు.. ఒక్కసారిగా పడిపోయిన ఆ మహిళ కాలిపై నుంచి వెళ్లింది. వెంటనే ఆ మహిళ నొప్పితో కేకలు వేయగా.. గమనించిన స్థానికులు ఆమెను వెనక్కి లాగి హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. 

Also Read: https://teluguprabha.net/andhra-pradesh-news/ap-state-weather-forecast-updates/

ఆమె కాలికి తీవ్ర గాయమైందని ప్రస్తుతం ఆమెకు చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. అభిమానుల తాకిడి, భద్రతా ఏర్పాట్ల మధ్య ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. ఈ ఘటనపై ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ ప్రమాదంపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్‌ చేస్తున్నాయి. 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad