Wednesday, April 2, 2025
Homeఆంధ్రప్రదేశ్Shyamala: పవన్ కల్యాణ్ పై మరోసారి శ్యామల సంచలన వ్యాఖ్యలు..!

Shyamala: పవన్ కల్యాణ్ పై మరోసారి శ్యామల సంచలన వ్యాఖ్యలు..!

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి.. యాంకర్ శ్యామల మరోసారి విమర్శలు గుప్పించారు. ప్రభుత్వంలో ఉన్న వ్యక్తిగా బాధితుల సమస్యలను పరిష్కరించాల్సిన అవసరం ఉందని, కానీ పవన్ కల్యాణ్ కనీసం ఆ బాధ్యత కూడా తీసుకోలేదని ఆమె ఆరోపించారు. రాజమండ్రిలో ఆత్మహత్యాయత్నం చేసిన మెడికల్ విద్యార్థిని అంజలిని పరామర్శించేందుకు వైసీపీ మహిళా ప్రతినిధుల బృందం ఆసుపత్రిని సందర్శించింది.

- Advertisement -

వైసీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుడు కళ్యాణి, వైసీపీ అధికార ప్రతినిధి శ్యామల ఆసుపత్రికి వెళ్లి అంజలి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఆమె కుటుంబ సభ్యులతో మాట్లాడి ఘటనకు సంబంధించిన వివరాలు సేకరించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ, బాధితురాలికి న్యాయం జరిగేలా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి కారకుడైన దీపక్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని, కేసుపై సమగ్ర విచారణ జరిపించాలని కోరారు. ఘటన జరిగిన రోజు ఏం జరిగిందనే విషయాన్ని వెల్లడించేలా సీసీటీవీ ఫుటేజ్‌ను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అంతేగాక, అంజలి ప్రమాదకరమైన ఇంజెక్షన్‌ను స్వయంగా తీసుకున్నదా, లేక మరెవరైనా ఇచ్చారా అనే అనుమానాలకు ప్రభుత్వం సమాధానం ఇవ్వాల్సిన అవసరం ఉందని అన్నారు.

ఈ ఘటనతో రాష్ట్రంలో మహిళల భద్రతపై కూటమి ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణిని ప్రదర్శిస్తోందని విమర్శించారు. రాష్ట్రంలో ప్రతి గంటకు ముగ్గురు మహిళలు అఘాయిత్యానికి గురవుతున్నా, ప్రభుత్వం స్పందించడంలేదని ఆక్షేపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నేరస్థులకు కఠిన శిక్షలు పడడం లేదని, ఇది మహిళల రక్షణకు తక్కువసామర్థ్యాన్ని ప్రతిబింబిస్తోందని అన్నారు. ప్రభుత్వం బాధితురాలికి మెరుగైన వైద్య సహాయాన్ని అందించి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News