ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రాజకీయంగా టార్గెట్ అవుతున్నారు. గతంలో ఆయన ఇచ్చిన మాటలకు , ఇప్పుడు చేస్తున్న పనులకు ఏమాత్రం సంబంధం ఉండటం లేదనే విమర్శ ఆయనపై ఉంది. ఆడపిల్లలకు అన్యాయం జరిగితే ఊరుకునే పరిస్థితి లేదని చెప్పిన పవన్ కల్యాణ్, తన సొంత నియోజకవర్గంలో మహిళలపై జరుగుతున్న అన్యాయాలపై నోరు మెదపడం లేదని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు.
సుగాలి ప్రీతి కేసు
2018లో నెల్లూరులో జరిగిన సుగాలి ప్రీతి హత్య కేసు ఎంతో సంచలనం సృష్టించింది. గత టీడీపీ, వైసీపీ ప్రభుత్వాలు ఈ కేసును సరిగా పట్టించుకోలేదన్న ఆరోపణలున్నాయి. పవన్ కళ్యాణ్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బాధితురాలి కుటుంబాన్ని స్వయంగా పరామర్శించి, తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. కానీ, ప్రస్తుతం కూటమి అధికారంలోకి వచ్చి 15 నెలలైనా ఈ కేసులో ఎటువంటి పురోగతి లేకపోవడంతో సుగాలి కుటుంబం పవన్ కళ్యాణ్ పై తీవ్ర విమర్శలు చేస్తోంది. గతంలో అనేకసార్లు మంగళగిరిలోని పార్టీ కార్యాలయానికి వచ్చినా అపాయింట్‌మెంట్ దొరకలేదని ఆ కుటుంబం ఆవేదన వ్యక్తం చేస్తోంది.
సీపీఎస్ రద్దుపై హామీ
ఉద్యోగులు, ఉపాధ్యాయులకు సంబంధించిన సీపీఎస్ రద్దుపై పవన్ కళ్యాణ్ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ ఇప్పుడు ఆయనకు మరో సవాలుగా మారింది. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో దీనికి పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చినా ఇప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోలేదు. దీనిపై ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. గతంలో జగన్మోహన్ రెడ్డి కూడా ఈ హామీని అమలు చేయలేకపోయారు.
Nara Lokesh : పండక్కి ముందే గుడ్ న్యూస్ చెప్పిన నారా లోకేష్
విమర్శలకు అవకాశం
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై తీవ్రంగా స్పందించిన పవన్ కళ్యాణ్, ఇప్పుడు ఆ విషయంలో మౌనంగా ఉండడం కూడా విమర్శలకు తావిస్తోంది. అయితే, పవన్ కళ్యాణ్ చాలా హామీలను అమలు చేశారని చెప్పినా, ఈ కొన్ని హామీల అమలులో జాప్యం చేయడం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప్రచార అస్త్రంగా మారింది. పవన్ కళ్యాణ్ ఈ విమర్శలను ఎలా ఎదుర్కొంటారో చూడాలి. ఇది ఆయన రాజకీయ భవిష్యత్తుకు ఒక పరీక్ష లాంటిది.


