Friday, January 10, 2025
Homeఆంధ్రప్రదేశ్Pawan Kalyan: సజ్జలకు భారీ షాక్.. విచారణకు పవన్ ఆదేశం

Pawan Kalyan: సజ్జలకు భారీ షాక్.. విచారణకు పవన్ ఆదేశం

వైసీపీ కీలక నేత, మాజీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి(Sajjala Ramakrishna Reddy) కుటుంబంపై భూ కబ్జా ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. కడప జిల్లా సీకే దిన్నె రెవెన్యూ పరిధిలోని 1599, 1600/1, 2, 1601/1, 12, 255 పాటు ఇతర సర్వే నెంబర్లలోని 52 ఎకరాల చుక్కల భూములు, అటవీ భూములు, ప్రభుత్వ భూములు సజ్జల కుటుంబం ఆక్రమించిందని తెలుస్తోంది. ఈ వ్యవహారంపై ఏపీ ప్రభుత్వం సీరియస్ అయింది. వెంటనే రంగంలోని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Pawan Kalyan) దీనిపై సమగ్ర విచారణ చేయాలంటూ కడప జిల్లా కలెక్టర్‌కు ఆదేశాలు జారీ చేశారు.

- Advertisement -

ఈ భూములు ఎవరి ఆధీనంలో ఉన్నాయి..? వన్యప్రాణులకు ఎలాంటి హాని కలిగింది..? వంటి అంశాలపై విచారణ జరపాలని సూచించారు. పేదల, ప్రభుత్వ భూముల జోలికి ఎవరు వచ్చినా సహించేది లేదని ఆయన హెచ్చరించారు. పవన్ కళ్యాణ్‌ ఆదేశాలతో అధికారులు రంగంలోకి దిగారు. ఫారెస్ట్, రెవెన్యూ అధికారులు భూములను సర్వే చేస్తున్నారు. మరోవైపు ఈ భూముల్లోనే సజ్జల గెస్ట్ హౌస్ కట్టుకున్నట్టు సమాచారం. దీంతో భూ కబ్జా వ్యవహారం సజ్జల కుటుంబానికి ఉచ్చు బిగుస్తోంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News