ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Pawan Kalyan) కడపలో పర్యటించనున్నారు. ఈమేరకు గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో కడపకు బయలుదేరారు. వాతావరణం అనుకూలించకపోవడంతో విమానం గంట ఆలస్యంగా ప్రారంభమైంది. వైసీపీ నేతల దాడిలో గాయపడి రిమ్స్‌లో చికిత్స పొందుతున్న గాలివీడు ఎంపీడీవో జవహర్ బాబును పరామర్శించునున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు.
కాగా ఎంపీడీవో జవహర్ బాబుపై దాడి కేసులో 26 మంది వైసీపీ నేతలపై పోలీసులు కేసు నమోదు చేశారు. అలాగే ప్రభుత్వ అధికారి విధులకు ఆటంకం కలిగించడంతో పాటు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదుచేసినట్లు పోలీసులు తెలిపారు. వైసీపీ ఎంపీపీ కుమారుడు సురేందర్ రెడ్డి తన అనుచరులతో ఎంపీడీవోపై దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఎంపీడీవోకు తీవ్ర గాయలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు.