జాతీయ ఓటర్ల దినోత్సవం(National Voters Day) సందర్భంగా యువతీ, యువకులకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Pawan kalyan) కీలక పిలుపునిచ్చారు. ఈమేరకు ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు.
“ఓటు అనేది మనకు రాజ్యాంగం ప్రసాదించిన ప్రాథమిక హక్కు. ప్రజాస్వామ్యం పరిరక్షించాలన్నా, రాజ్యంగా విలువలు కాపాడాలన్నా, సరైన నాయకులను చట్ట సభలకు పంపించాలి. అలాంటి వారిని ఎన్నుకుని మన భవిష్యత్తుని తీర్చిదిద్దుకునే శక్తివంతమైన ఆయుధం ఓటు హక్కు. 18 సంవత్సరాలు నిండిన ప్రతీ ఒక్క యువతీ, యువకుడు తప్పని సరిగా ఓటు హక్కు నమోదు చేసుకుని, విధిగా ఓటింగ్లో పాల్గొనాలని కోరుతున్నాను” అని ఆయన సూచించారు. కాగా భాతరదేశంలో ఓటు హక్కుపై అవగాహన కల్పించి ఓటర్ల సంఖ్యను పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏడాది జనవరి 25న జాతీయ ఓటర్ల దినోత్సవం జరుపుకుంటున్న సంగతి తెలిసిందే.