Pawan kalyan latest look: ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన లుక్ మార్చేశారు. రాజకీయంగా అధికార భాద్యతలు చేపట్టిన తర్వాత ఎక్కువగా సంప్రదాయ వైట్ కుర్తా-పైజామాలోనే దర్శనమిచ్చిన ఆయన, ఈసారి మాత్రం పూర్తిగా డిఫరెంట్ స్టైలుతో మెరిశారు. ప్యాంటు షర్ట్ వేసుకొని అదిరిపోయే కటౌట్‌తో దర్శనమిచ్చారు.
రాజమహేంద్రవరంలో నిర్వహించిన ‘అఖండ గోదావరి’ టూరిజం ప్రాజెక్ట్ శంకుస్థాపన కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ షర్ట్, ఫ్యాంట్‌తో టక్ చేసుకొని హాజరయ్యారు. సాధారణ ప్రజలకు ఆప్యాయంగా కనిపించేలా ఉండే ఆయన కొత్త వేషధారణ ఫోటోలు వైరల్‌గా మారాయి. రాజకీయ నేతగా కాకుండా పవన్ నటుడిగా అభిమానుల గుండెల్లో నాటుకుపోయేలా ఉన్న కొత్త లుక్‌పై అభిమానుల నుంచి మంచి స్పందన వస్తోంది.
ఇదే తరహాలో ఇటీవల విజయవాడలోని పెనమలూరు మండలంలో ఓ సెలూన్ ప్రారంభోత్సవంలో కూడా పవన్ కళ్యాణ్ సాదాసీదా టీషర్ట్, షార్ట్‌లో కనిపించి అందరినీ ఆశ్చర్యపర్చారు. ‘కొనిక’ పేరిట ప్రారంభమైన ఆ సెలూన్ ఓనర్ పవన్‌కు అత్యంత సన్నిహితుడవ్వడంతో ఆయన స్వయంగా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అప్పుడే కనిపించిన ఆయన కొత్త హెయిర్‌స్టైల్ ఇప్పుడు కూడా కొనసాగుతూ అభిమానులను ఆకట్టుకుంటోంది. పవన్ కళ్యాణ్ రాజకీయ నాయకుడిగా బిజీ షెడ్యూల్ గడుపుతునే ఆయన ఒప్పుకున్న సినిమాలను సైతం పూర్తి చేస్తున్నారు. అధికార బాధ్యతల నుంచి కొంచెం సమయం తీసుకొని మధ్య మధ్యలో షూటింగ్ చేసుకుంటున్నారు. అయితే షూటింగ్ మళ్ళీ పాడవకూడదనే కారణంతో పవన్ ఇంకా అలాంటి లుక్‌నే కొనసాగిస్తూ అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నారు. సాధారణంగా యోగిలా కనిపించే ఆయన హెయిర్ స్టైల్ కూడా మార్చేసుకున్నారు. ఇప్పుడు ఆయనను చూసిన అభిమానులు వింటేజ్ పవర్ స్టార్ ఈజ్ బ్యాక్ అంటూ పోస్టులు చేస్తున్నారు.
కాగా పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. పవన్ కళ్యాణ్ ఇప్పటికే తన పాత్రకు సంబంధించిన షూటింగ్ మొత్తం పూర్తి చేయగా.. మూవీ గ్రాఫిక్స్ పనులు జరుగుతున్నాయి. క్రిష్ జాగర్లమూడి, జ్యోతి కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఇప్పుడు తుది దశకు చేరుకున్నట్లు తెలుస్తోంది. అంతా సవ్యంగా జరిగితే జులై 24వ తేదీన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. అటు పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఏపీ రాజకీయాలను చూసుకుంటూనే, OG, హరీష్ శంకర్ మూవీ షూటింగ్‌లలో పాల్గొంటున్నారు. ఆయన స్పీడ్ చూస్తుంటే రానున్న రోజుల్లో త్వరగానే తన పాత్రకు సంబంధించిన చిత్రీకరణను మొత్తాన్ని పూర్తి చేసుకొని.. పూర్తి స్థాయి రాజకీయాల్లో నిమగ్నమవ్వాలని అనుకుంటున్నట్లు కనిపిస్తోంది.