ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) మహారాష్ట్ర ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఖరారైంది. ఆయన రెండు రోజులపాటు మహా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులకు మద్దతుగా ఆయన ప్రచారం నిర్వహిస్తారు. ఈ నెల 16, 17 వ తేదీల్లో ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రచారంలో భాగంగా ఐదు బహిరంగ సభల్లో రెండు రోడ్ షోలో పవన్ కళ్యాణ్ పాల్గొంటారు. మొదటి రోజు మరాట్వాడా ప్రాంతంలోని నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తారు. 16వ తేదీ ఉదయం నాందేడ్ జిల్లా డెగ్లూర్ నియోజకవర్గం లో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు.
అనంతరం అదే జిల్లాలోని భోకర్ నియోజకవర్గంలో నిర్వహించే సభలో పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) పాల్గొననున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు లాతూర్ చేరుకుంటారు. అక్కడ నిర్వహించే సభలో పాల్గొంటారు. రాత్రి 6గం.కు షోలాపూర్ నగరంలో రోడ్ షోలో పాల్గొంటారు. 17వ తేదీన విదర్భ ప్రాంతానికి వెళ్తారు. ఆ రోజు ఉదయం చంద్రపూర్ జిల్లాలోని బల్లార్ పూర్ పట్టణంలో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు. సాయంత్రం పుణె కంటోన్మెంట్ నియోజకవర్గం పరిధిలో నిర్వహించే రోడ్ షోలో పాల్గొంటారు. అనంతరం కస్బా పేట్ నియోజకవర్గంలోని ఎన్నికల ప్రచార సభలో పాల్గొంటారు.