Sunday, May 11, 2025
Homeఆంధ్రప్రదేశ్కన్నీళ్లు ఆపుకోలేకపోయిన పవన్ కళ్యాణ్.. మురళి నాయక్‌ కుటుంబానికి పరామర్శ..!

కన్నీళ్లు ఆపుకోలేకపోయిన పవన్ కళ్యాణ్.. మురళి నాయక్‌ కుటుంబానికి పరామర్శ..!

శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కల్లితండా గ్రామం విషాదంలో మునిగిపోయింది. పాకిస్తాన్ కాల్పుల్లో వీర మరణం పొందిన భారత ఆర్మీ జవాన్ మురళి నాయక్ కుటుంబాన్ని ఆదివారం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, రాష్ట్ర మంత్రి నారా లోకేష్ పరామర్శించారు. గ్రామానికి చేరుకున్న నేతలు మురళి నాయక్ భౌతికకాయానికి పుష్పాంజలి ఘటించి, తల్లిదండ్రులను ఓదార్చే ప్రయత్నం చేశారు. వీర జవాన్ తల్లి కన్నీటితో విలపించడంతో అక్కడున్న ప్రతి ఒక్కరు భావోద్వేగానికి లోనయ్యారు. ఆమె తీరని విషాదాన్ని చూసిన పవన్ కళ్యాణ్ కు మాటలు కూడా రాలేదు.. మురళి నాయక్ త్యాగం దేశానికి గర్వకారణమని పేర్కొన్నారు.

- Advertisement -

మురళి నాయక్ మరణంపై స్పందించిన పవన్ కళ్యాణ్, ఈ దేశ రక్షణ కోసం ప్రాణాలను అర్పించిన ఆయన త్యాగం మాటల్లో చెప్పలేమన్నారు. మురళి కుటుంబానికి అండగా ఉంటామని తెలిపారు. ఈ విషాద ఘటన ప్రతి ఒక్క మనిషిని లోపల నుంచి కలిచివేస్తోంది. మున్ముందు ఇలాంటివి జరగకుండా ఉండాలంటే దేశానికి శత్రువులపై స్పష్టమైన విధానం అవసరమని అన్నారు. అంతేకాక, తన తరఫున మురళి నాయక్ కుటుంబానికి రూ.25 లక్షల ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా మురళి కుటుంబానికి భరోసా కల్పిస్తూ పలు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంది. రూ.50 లక్షల విరాలంతో పాటు.. ఐదు ఎకరాల భూమి, 300 గజాల నివాస స్థలం, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించనున్నట్లు ప్రకటించింది. వీర జవాన్ త్యాగాన్ని గౌరవిస్తూ వీటిని తక్షణమే అమలు చేస్తామని అధికారులు తెలిపారు.

గోరంట్ల మండలంలోని కల్లితండా గ్రామం ఈరోజు దేశభక్తితో మార్మోగింది. మురళి నాయక్ అమరరహే అనే నినాదాలు ప్రతి మూలన ప్రతిధ్వనించాయి. దేశం కోసం చేసిన మురళి నాయక్ త్యాగం కేవలం ఆయన కుటుంబానిదే కాదు, ఈ దేశమంతటివని గ్రామస్తులు పేర్కొన్నారు. సైనికుడిగా చూపిన ఆయన సాహసం, ధైర్యం భారత యువతకు మార్గదర్శకంగా నిలుస్తుందన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News