HomeTop StoriesPawan Kalyan: 'మీ కష్టాలు చూసే రోడ్ల నిర్మాణానికి ఉపక్రమించా'

Pawan Kalyan: ‘మీ కష్టాలు చూసే రోడ్ల నిర్మాణానికి ఉపక్రమించా’

Janasena Pawan Kalyan: జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా, పార్టీ అధినేత, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అల్లూరి సీతారామరాజు జిల్లాలోని పాడేరు నియోజకవర్గంలో గిరిజనుల మధ్య వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తొలుత పాడేరులోని ఓనూరు జంక్షన్‌ వద్ద పార్టీ పతాకాన్ని పవన్ కళ్యాణ్ ఆవిష్కరించారు. అనంతరం ‘అడవితల్లి బాట’ కార్యక్రమంలో భాగంగా ఏజెన్సీ ప్రాంతాల్లో నూతనంగా నిర్మించిన రహదారులను ఆయన ప్రారంభించారు.

- Advertisement -

Also Read: https://teluguprabha.net/cinema-news/arjun-das-shares-heartbreaking-post-goes-viral-on-social-media/

ఓనూరు జంక్షన్ నుంచి నందిగరువు వరకు సుమారు 2.4 కిలోమీటర్ల మేర కొత్తగా వేసిన రోడ్డుపై పవన్‌ కళ్యాణ్‌ కాలినడకన పర్యటించారు. రోడ్ల నాణ్యతను పరిశీలించారు. అనంతరం నందిగరువు గ్రామంలో గిరిపుత్రులతో ‘మాటా-మంతి’ నిర్వహించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. 

‘సామాన్యులకు అండగా ఉండాలనే పార్టీ ఆశయానికి అనుగుణంగా, ఆర్భాటాలకు దూరంగా గిరిజన పల్లెల్లో ఈ వేడుకలను నిర్వహించాలని నిర్ణయించాం. గత ప్రభుత్వం కనీసం ప్రజల సమస్యలు విన్న పరిస్థితులు కూడా లేవు. ప్రజలెవరూ నన్ను కలిసి రోడ్లు వేయాలని కోరలేదు. మీ కష్టాలు చూసే రహదారుల నిర్మాణానికి ఉపక్రమించా.’ అని పవన్‌ కళ్యాణ్‌ పేర్కొన్నారు. 

Also Read: https://teluguprabha.net/telangana/woman-said-no-to-marriage-man-injected-aids-blood/ 

పర్యటన ముగింపు అనంతరం గిరిజనులతో కలిసి పవన్ కళ్యాణ్ సహపంక్తి భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, కూటమి నాయకులు పాల్గొన్నారు. 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News