Tuesday, April 29, 2025
Homeఆంధ్రప్రదేశ్Pawan Kalyan: అలా అయితే పాకిస్తాన్ వెళ్లిపోండి: పవన్‌ కళ్యాణ్‌

Pawan Kalyan: అలా అయితే పాకిస్తాన్ వెళ్లిపోండి: పవన్‌ కళ్యాణ్‌

పహల్గామ్ ఉగ్రదాడిలో (Pahalgam Terror Attack) అమరవీరులకు జనసేన సంతాపం ప్రకటించింది. మంగళగిరిలోని సి.కె.కన్వెన్షన్‌లో హాలులో నిర్వహించిన సంతాప సభలో ఆ పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Pawan Kalyan), మంత్రి నాదెండ్ల మనోహర్, ఇతర నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మృతులకు సంతాపం తెలియజేస్తూ రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు.

- Advertisement -

అనంతరం పవన్ మాట్లాడుతూ.. ఐడీ కార్డులు అడిగి హిందువా, ముస్లింవా అని అడిగి మరీ అత్యంత క్రూరంగా అమాయకుల ప్రాణాలు తీశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మత ప్రాతిపదికన 26 మందిని చంపినా పాక్‌కు అనుకూలంగా మాట్లాడటం సరికాదన్నారు. అలా మాట్లాడాలనుకుంటే ఆ దేశానికే వెళ్లిపోవాలని సూచించారు. కశ్మీర్‌లో రాష్ట్రపతి పాలన ఉన్నంత వరకు ప్రశాంతంగా ఉందని.. అధికారం రాష్ట్రం చేతిలోకి వెళ్లగానే ఇలాంటి దుర్ఘటన జరిగిందన్నారు. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన మధుసూదన్‌రావు కుటుంబానికి పార్టీ తరఫున రూ.50లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News