పహల్గాం ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన ఏపీ వాసి మధుసూదన్ రావు మృతదేహానికి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan Kalyan) నివాళులర్పించారు. పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కావలిలో మధుసూదన్ భౌతికకాయానికి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. ప్రభుత్వం తరఫున అన్ని విధాల ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. అంతకు ముందు పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కూడా కావలి చేరుకొని మృతదేహానికి నివాళులర్పించారు. కాగా ఉగ్రదాడిలో మృతిచెందిన మధుసూదన్ బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు.
Pawan Kalyan: మధుసూదన్ రావుకు పవన్ కల్యాణ్ నివాళులు
సంబంధిత వార్తలు | RELATED ARTICLES