Friday, June 13, 2025
Homeఆంధ్రప్రదేశ్Pawan Kalyan: లోకేశ్ కుమారుడిపై పవన్ కళ్యాణ్‌ ప్రశంసలు

Pawan Kalyan: లోకేశ్ కుమారుడిపై పవన్ కళ్యాణ్‌ ప్రశంసలు

ఏపీ సీఎం చంద్రబాబు(Chandrababu) మనవడు, మంత్రి నారా లోకేశ్(Nara Lokesh) కుమారుడు నారా దేవాన్ష్‌పై జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan Kalyan) ప్రశంసలు కురిపించారు. ఇటీవల దేవాన్ష్ కేవలం 11 నిమిషాల 59 సెకండ్లలోనే 175 చెస్ పజిల్స్ పూర్తి చేసి వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన వీడియోను పవన్ కల్యాణ్ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు.

- Advertisement -

వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించినందుకు దేవాన్ష్‌ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని తెలిపారు. చిన్న వయస్సులోనే చెస్‌లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన దేవాన్ష్ భవిష్యత్తులో మరిన్ని రికార్డులు నెలకొల్పి గ్రాండ్ మాస్టర్ స్థాయికి ఎదగాలని ఆకాంక్షిస్తున్నాను” అంటూ తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News