Saturday, November 15, 2025
Homeఆంధ్రప్రదేశ్Pawan Kalyan: పంచెకట్టుతో పవన్ కళ్యాణ్ లుక్ అదుర్స్

Pawan Kalyan: పంచెకట్టుతో పవన్ కళ్యాణ్ లుక్ అదుర్స్


Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో దూసుకుపోతున్నారు. ఓవైపు రాష్ట్రంలోని పలు గ్రామాల్లో పర్యటిస్తూ ప్రజలకు చేరువగా ఉంటున్నారు. పంచాయతీ రాజ్, అటవీశాఖ మంత్రిగా తనదైన శైలిలో అభివృద్ధి చేస్తున్నారు. గ్రామాలను బాగు చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. పంచాయతీలకు కేంద్రం నుంచి నిధులు రాబడుతూ గ్రామాల రూపురేఖలు మారుస్తున్నారు. ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రిగా ఏడాదిలోనే మారుమూల గ్రామాల్లో కూడా రోడ్లు వేయించారు. ఇలా ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్నారు.

2024 అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేసిన 21 అసెంబ్లీ, రెండు పార్లమెంట్ సీట్లను గెలుచుకుని 100శాతం స్ట్రైక్ రేట్ సాధించారు. దీంతో దేశంలో పవన్ కళ్యాణ్ పేరు మార్మోగింది. ప్రధాని మోదీ కూడా పవన్ ను తుఫాన్ అంటూ అభినందించారు. అప్పటి నుంచి ఎన్డీఏ ప్రభుత్వంలో పవన్ కు ప్రాధాన్యత ఏర్పడింది. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ పాగా వేసేందుకు పవన్ క్రేజ్ ను ఉపయోగించుకుంటుంది. ఇటీవల సనాతన ధర్మం నినాదం ఎత్తుకున్న పవన్.. తమిళనాడుపై ప్రత్యేక దృ‌ష్టి పెట్టారు. కొన్ని నెలల క్రితం తమిళనాడులోని ప్రముఖ ఆలయాలు సందర్శించారు.

వచ్చే ఏడాది తమిళనాడుకు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటినుంచే పవన్ క్రేజ్ ను ఉపయోగించుకుని అధికారంలోకి రావాలని బీజేపీ భావిస్తోంది. అందుకు తగ్గట్లు ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది. ఈ క్రమంలోనే తమిళనాడులో ఆలయాల సందర్శన చేపట్టారు. అలాగే డీఎంకే సిద్ధాంతాలపై విమర్శలు గుప్పించారు. దీంతో డీఎంకే నేతలు కూడా పవన్ ను టార్గెట్ చేసుకుంటూ ప్రతివిమర్శలు చేస్తున్నారు.

ఇదిలా ఉండగానే తాజాగా పవన్ కళ్యాణ్ తమిళనాడులో ల్యాండ్ అయ్యారు. ఇవాళ సాయంత్రం లక్షలాది మంది సుబ్రమణ్యస్వామి భక్తులతో జరిగే మురుగ భక్తర్గల్ మానాడు కార్యక్రమంలో పాల్గొనేందుకు ప్రత్యేక విమానంలో మధురై చేరుకున్నారు. మధురై విమానాశ్రయంలో పవన్‌కి బీజేపీ తమిళనాడు రాష్ట్ర అధ్యక్షులు నైనార్ నాగేంద్రన్, తమిళనాడు అబ్జర్వర్ పొంగులేటి సుధాకర్ రెడ్డి, తమిళనాడు బీజేపీ నాయకులు ఘనస్వాగతం పలికారు. అయితే తమిళనాడు స్టైల్ లో పంచెకట్టులో పవన్ కనిపించారు. పంచెకట్టుతో విమానం నుంచి దిగుతున్న పవన్ లుక్స్ అదిరిపోయాయి. దీంతో ఫ్యాన్స్ పవన్ పంచెకట్టు లుక్ అదుర్స్ అంటూ సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ చేస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad