Monday, January 13, 2025
Homeఆంధ్రప్రదేశ్Pawan Kalyan: పల్లెలు పిల్లాపాపలతో కళకళలాడుతుంటే సంతోషంగా ఉంది: పవన్ కళ్యాణ్‌

Pawan Kalyan: పల్లెలు పిల్లాపాపలతో కళకళలాడుతుంటే సంతోషంగా ఉంది: పవన్ కళ్యాణ్‌

తెలుగు రాష్ట్రాల ప్రజలకు జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Pawan Kalyan) సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సంక్రాంతి వేళ పల్లెలు పిల్లాపాపలతో కళకళలాడుతుంటే సంతోషంగా ఉందన్నారు. సూర్యభగవానుడు మకర రాశిలోకి ప్రవేశించే ఈ పుణ్య సమయాన ధాన్యరాసులను లోగిళ్లకు మోసుకువచ్చే ఈ సంక్రాంతి పండుగ వేళ భారతీయులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు అని చెప్పారు. ఈమేరకు సోషల్ మీడియా వేదికగా ఓ ప్రకటన విడుదల చేశారు.

- Advertisement -

‘రంగవల్లులు.. గొబ్బెమ్మలు.. గంగిరెద్దులు.. హరిదాసులు.. భోగిమంటలు.. పిండివంటల సమ్మేళనమే సంక్రాంతి. అటువంటి సరదాల కోసం నగరాలన్నీ పల్లెల వైపు పరుగులు తీశాయి. ఇది ప్రజలకు పండుగపై ఉన్న మక్కువను తెలియజేస్తుంది. ఉపాధి కోసం పల్లె బిడ్డలు నగరాలకు వలసపోవడంతో గ్రామాలు జనాలు లేక కొంతవరకు పలుచబడ్డాయి. ఈ సంక్రాంతి వేళ పల్లెలు పిల్లాపాపలతో కళకళలాడుతుంటే సంతోషంగా ఉంది. పల్లె సౌభాగ్యమే దేశ సౌభాగ్యం. ఆనందాలు, సిరిసంపదలతో సుభిక్షంగా శోభిల్లాలని, తెలుగు రాష్ట్రాల ప్రజలు సుఖ సంతోషాలతో విరాజిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’ అని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News