జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) సనాతనధర్మ పరిరక్షణలో భాగంగా కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లోని పలు ఆలయాలను సందర్శించనున్నారు. ఇందులో భాగంగా కేరళలోని కొచ్చి సమీపంలో ఉన్న అగస్త్య మహర్షి ఆలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు. పవన్ కల్యాణ్ వెంట ఆయన కుమారుడు అకీరా నందన్(Akira Nandan) , టీటీడీ బోర్డు సభ్యుడు ఆనంద్‌సాయి ఉన్నారు. బుధవారం సాయంత్రం తిరువనంతపురంలోని పరశురామస్వామి ఆలయాన్ని పవన్ సందర్శించనున్నారు. నాలుగు రోజుల ఈ పర్యటనలో అనంత పద్మనాభ స్వామి, మధుర మీనాక్షి, శ్రీ పరస రామస్వామి, అగస్త్య జీవ సమాధి, కుంభేశ్వర దేవాలయం, స్వామి మలైయ్, తిరుత్తై సుబ్రమణ్యేశ్వర స్వామి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.
![](https://teluguprabha.net/wp-content/uploads/2025/02/Gjkcnm8W8AEFGWI-1024x709.jpg)
అయితే ఆకస్మాత్తుగా దక్షిణాది రాష్ట్రాల్లో పవన్ ఆలయాల పర్యటన వెనుక భారీ వ్యూహం ఉన్నట్లుగా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సనాతన ధర్మ పరిరక్షణ, బీజేపీ తరఫున హిందుత్వ వాదాన్ని బలంగా వినిపించేందుకే ఈ పర్యటన చేపట్టారని చెబుతున్నారు. ఉత్తరాదిలో బలంగా ఉన్న బీజేపీ దక్షిణాదిలో మాత్రం సత్తా చాటుకోలేకపోయింది. దీంతో పవన్ కళ్యాణ్ ద్వారా బలంగా పుంజుకోవాలని పక్కా ప్రణాళికలు రచిస్తుందని పేర్కొంటున్నారు.
![](https://teluguprabha.net/wp-content/uploads/2025/02/GjkcpiFWAAAoxnC-1024x694.jpg)
![](https://teluguprabha.net/wp-content/uploads/2025/02/GjkcnjYWgAAJayl-641x1024.jpg)