Sunday, January 5, 2025
Homeఆంధ్రప్రదేశ్Pawan Kalyan: విజయవాడలో బుక్ ఫెస్టివల్ ప్రారంభించిన పవన్ ‌కల్యాణ్‌

Pawan Kalyan: విజయవాడలో బుక్ ఫెస్టివల్ ప్రారంభించిన పవన్ ‌కల్యాణ్‌

విజయవాడలో 35వ బుక్ ఫెస్టివల్(Book Festival)ను ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) ప్రారంభించారు. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి మంత్రి పయ్యావుల కేశవ్, సాహిత్య అకాడమీ కార్యదర్శి కె.శ్రీనివాసరావు తదితర ప్రముఖులు హాజరయ్యారు. ఈ నెల 2 నుంచి 12వ తేదీ వరకు ప్రతిరోజూ మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు బుక్ ఎగ్జిబిషన్(Vijayawada Book Exhibition) కొనసాగుతోంది.

- Advertisement -

ఇక పుస్తక మహోత్సవ ప్రాంగణానికి పిడికిటి రామ కోటేశ్వర రావు, ప్రధాన సాహిత్య వేదికకు రామోజీ గ్రూపు సంస్థల వ్యవస్థాపకులు రామోజీరావు, విద్యార్థుల కార్యక్రమాలు నిర్వహించే ప్రతిభా వేదికకు రతన్ టాటా పేర్లు పెట్టారు. కాగా విజయవాడలో మూడున్నర దశాబ్దాలుగా ప్రతి ఏడాది పుస్తక మహోత్సవం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News