ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంతో పాటు కొన్ని కీలక సమీక్షలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Pawan Kalyan) హాజరుకాని సంగతి తెలిసిందే. దీనిపై ప్రతిపక్షాలు విమర్శలు చేశాయి. తాజాగా ఆ విమర్శలపై పవన్ స్పందించారు. వెన్నునొప్పి కారణంగానే రాష్ట్రంలో కొన్ని సమావేశాలకు హాజరుకాలేకపోయానని.. ఇప్పటికీ వెన్నునొప్పి తీవ్రంగా బాధిస్తోందని తెలిపారు.
ఏపీని జగన్ అప్పుల కుప్పగా మార్చారని.. అందువల్ల ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని వెల్లడించారు. అయినా ఇచ్చిన హామీలు అమలు చేసుకుంటూ ముందుకు వెళుతున్నామని చెప్పుకొచ్చారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలకు కట్టుబడి పనిచేస్తోందని చెప్పారు. కూటమిలోని మూడు పార్టీల నేతలు సమన్వయంతోనే కలిసి ముందుకు వెళుతున్నట్టు పవన్ స్పష్టం చేశారు.
కాగా ఢిల్లీ సీఎం(Delhi CM) ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ పాల్గొన్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో పవన్‌కు ప్రధాని మోదీ షేక్ హ్యాండ్ ఇచ్చి కొద్దిసేపు సరదాగా ముచ్చటించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.