Saturday, January 11, 2025
Homeఆంధ్రప్రదేశ్Pawan Kalyan: బుక్‌ ఫెస్టివల్ సందర్శించిన పవన్ కళ్యాణ్‌.. ఆయనకి నచ్చిన బుక్స్ ఇవే..

Pawan Kalyan: బుక్‌ ఫెస్టివల్ సందర్శించిన పవన్ కళ్యాణ్‌.. ఆయనకి నచ్చిన బుక్స్ ఇవే..

విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో బుక్ ఫెస్టివల్(Book Festival)ను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌(Pawan Kalyan) సందర్శించారు. దాదాపు రెండున్నర గంటలపాటు ప్రతి స్టాల్‌లో పుస్తకాలను పరిశీలించారు. 6, 9 తరగతులు పుస్తకాలు, డిక్షనరీ, ఎకనామిక్స్, ఫైనాన్స్ పుస్తకాలతో పాటుగా తెలుగులో అనువదించిన ఖురాన్ గ్రంథం.. అలాగే కల్యాణి పబ్లికేషన్స్‌, తెలుగు ఇస్లామిక్‌ పబ్లికేషన్స్‌ సహా మరికొన్ని స్టాళ్లను సందర్శించిన పవన్‌ కల్యాణ్‌.. చాలా పుస్తకాలను కొనుగోలు చేశారు.

- Advertisement -
Pawan Kalyan

తెలుగు సాహిత్యానికి సంబంధించి పలు పుస్తకాలు పరిశీలించారు. అదే విధంగా ప్రాచీన సాహిత్యంపై వెలువరించిన విశ్లేషణలు, పరిశీలన పుస్తకాలను ఎంచుకున్నారు. వీటితో అనువాద సాహిత్య పుస్తకాలు, నిఘంటువులు, ఆధ్యాతిక సంబంధిత రచనలు పరిశీలించి కొనుగోలు చేశారు. ఈ సందర్భంగా తనకు ఎంతో నచ్చిన ‘మ్యాన్స్ సెర్చ్ ఫర్ మీనింగ్’ పుస్తకం చూసి ఎంతో సంతోషించారు. డా.విక్టర్ ఈ.ఫ్రాంకిల్ రాసిన ఈ పుస్తకం చదివితే నిరాశానిస్పృహలు అధిగమించి ఆశావాద భావన కలుగుతుందని చెప్పారు. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో నాజీల నిర్బంధాల్లో ఉన్న ఫ్రాంకిల్ ఎలా భవిష్యత్ జీవితాన్ని నిలుపుకున్నాడో ఆ రచన తెలుపుతుందన్నారు. ఎవరికైనా బహుమతిగా ఇవ్వడానికి ఉంటాయని ఎక్కువ సంఖ్యలో ఈ పుస్తకాలు కొనుగోలు చేశారు. అదే విధంగా భారతీయ చట్టాలు, చరిత్ర, రాజకీయ, పబ్లిక్ పాలసీ, శాస్త్ర సాంకేతిక, వ్యవసాయ, వృక్ష, పర్యావరణ సంబంధిత పుస్తకాలపై ప్రత్యేక ఆసక్తి చూపారు.

ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ వెంట విజయవాడ నగర కమిషనర్ రాజశేఖర్ బాబు, బుక్ ఫెయిర్ నిర్వాహకులు ఎమెస్కో విజయ్ కుమార్, టి.మనోహరనాయుడు, లక్ష్మయ్య, బాబ్జీ తదితరులు ఉన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News