Sunday, January 5, 2025
Homeఆంధ్రప్రదేశ్Pawan Kalyan: అల్లు అర్జున్ అరెస్ట్‌ వివాదంపై పవన్ కల్యాణ్‌ కీలక వ్యాఖ్యలు

Pawan Kalyan: అల్లు అర్జున్ అరెస్ట్‌ వివాదంపై పవన్ కల్యాణ్‌ కీలక వ్యాఖ్యలు

సంధ్య థియేట‌ర్‌లో జ‌రిగిన తొక్కిస‌లాట ఘ‌ట‌నతో పాటు హీరో అల్లు అర్జున్(Allu Arjun) అరెస్ట్ వివాదంపై తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్(Pawan Kalyan) స్పందించారు. మంగ‌ళగిరిలోని జనసేన కార్యాలయంలో ప్రముఖ నిర్మాత దిల్ రాజు జ‌న‌సేనానితో మాట్లాడారు. అనంతరం మీడియాతో చిట్‌చాట్‌లో పవన్ మాట్లాడుతూ.. గోటితో పోయే దాన్ని గోడ్డ‌లి వ‌ర‌కు తెచ్చారని తెలిపారు. తొక్కిసలాట ఘటన జరిగిన వెంటనే అల్లు అర్జున్ త‌ర‌ఫున ఎవరో ఒకరు బాధిత కుటుంబాన్ని పరామర్శించి ఉండాల్సిందని పేర్కొన్నారు. మానవత్వం లోపించట్లైందన్నారు.

- Advertisement -

బ‌న్నీ విష‌యంలో తెర ముందు, వెనుక ఏం జ‌రిగిందో తనకు తెలియ‌దన్నారు. ఇలాంటి ఘ‌ట‌న‌ల్లో పోలీసుల‌ను త‌ప్పుప‌ట్ట‌నని.. చ‌ట్టం అంద‌రికీ స‌మానమే అన్నారు. ఆ ఘటనలో తాను ఉన్నా కేసును వ్యతిరేకించే వాడిని కాదని స్పష్టం చేశారు. పోలీసులు త‌ప్ప‌కుండా భ‌ద్ర‌త గురించి ఆలోచిస్తారన్నారు. థియేట‌ర్ స్టాఫ్ అల్లు అర్జున్‌కు ముందు చెప్పి ఉండాల్సిందన్నారు. అల్లు అర్జున్ థియేటర్లో కూర్చున్నాక ఈ విషయం గురించి చెప్పి తీసుకెళ్లాల్సిందని.. చెప్పినా ఆయ‌న‌కు ఆ అరుపుల్లో స‌రిగా వినిపించ‌క‌పోవ‌చ్చని చెప్పుకొచ్చారు. చిరంజీవి కూడా గ‌తంలో ఫ్యాన్స్‌తో క‌లిసి థియేట‌ర్‌లో సినిమాలు చూసేవారని.. కానీ ఆయ‌న ముసుగు వేసుకుని ఒక్క‌రే థియేట‌ర్‌కు వెళ్లేవారని గుర్తు చేసుకున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News