Tuesday, September 17, 2024
Homeఆంధ్రప్రదేశ్Pawan-Balakrishna: బాలయ్యతో పవన్.. ప్రత్యర్థులది కడుపు మంటా?.. భయమా?

Pawan-Balakrishna: బాలయ్యతో పవన్.. ప్రత్యర్థులది కడుపు మంటా?.. భయమా?

- Advertisement -

Pawan-Balakrishna: ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉండాగానే ఏపీలో రాజకీయాలు వాడీవేడిగా సాగుతున్నాయి. ఇంకా చెప్పాలంటే మాటలతో అగ్గిరాజేసి దుమ్ముదులిపేస్తున్నారు ఇక్కడ నేతలు. మరోవైపు సభలు, యాత్రలు కూడా మొదలైపోయాయి. ఇలా ఉండగానే ఇప్పుడు మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. తెలుగు సినీ ఇండస్ట్రీలో బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ అగ్రహీరోలే కాదు.. మాస్ ఆడియన్స్ లో భారీ ఫాలోయింగ్ ఉన్న హీరోలు కూడా.

ఈ ఇద్దరు అటు సినీ స్టార్స్ మాత్రమే కాకుండా.. ఇద్దరూ రాజకీయాలలో కూడా కీలకమైన వ్యక్తులే. బాలయ్య ఇప్పటికే రెండోసారి ఎమ్మెల్యే కాగా.. పవన్ ఓ పార్టీకి అధ్యక్షుడు. ఇక.. బాలయ్య టీడీపీతో పవన్ జనసేన పొత్తు దాదాపు ఖరారు అనుకుంటున్న సమయంలోనే ఈ ప్రత్యేకంగా సమావేశమవడం ఇప్పుడు ఆసక్తిగా మారింది. తాజాగా వీరసింహారెడ్డి సినిమా షూటింగ్ లో బాలయ్యను పవన్ కలిశారు. కొద్దిసేపు ఆయన చిత్ర బృందంతో ముచ్చటించారు.

అయితే.. ఈ ఇద్దరు స్టార్స్ కలయికపై ప్రత్యర్ధులు మాటలతోనే విరుచుకుపడుతున్నారు. ముఖ్యంగా వైసీపీ నేతలు తీవ్ర విమర్శలకు దిగుతున్నారు. మంత్రుల నుండి ఎమ్మెల్యేల వరకు.. చైర్మన్ల నుండి ఇంచార్జీల వరకు తిట్ల పురాణం అందుకుంటున్నారు. ఏపీ ఫారెస్ట్ చైర్మన్ దేవేందర్ రెడ్డి లాంటి వాళ్ళైతే.. మీరు బ్రతుకుతున్నారు.. బురదలో దొర్లే.. అంటూ తీవ్ర వ్యాఖ్యలు కూడా చేశారు.

అయితే, బాలయ్యతో పవన్ కలయిక ప్రత్యర్థులలో భయం కలిగిస్తుందా? లేక ఇలా వాళ్ళ కలయిక ప్రత్యర్థులకు కడుపులో మంట తెప్పిస్తుందా?. టీడీపీ-జనసేన కలయిక వైసీపీకి తీరని నష్టం. అందుకే వైసీపీ నేతలు ఎప్పటికప్పుడు ఈ కలయికపై తీవ్ర వ్యాఖ్యలు దిగుతున్నారు. ఇక, బాలయ్య, పవన్ విషయానికి వస్తే త్వరలోనే ఈ ఇద్దరిపై అన్ స్టాపబుల్ షో షూటింగ్ జరగనుంది. ఈలోగా ఇలా భేటీతో అభిమానులలో జోష్ నింపారు. ఇది సహజంగానే వైసీపీ నేతలకు గిట్టని అంశం కాగా.. మాటలతో కాస్త చిచ్చు పెట్టే ప్రయత్నం చేయడం.. ఈ కలయికను ప్రజలలో తప్పుగా ప్రజెంట్ చేసే ప్రయత్నం చేయడం కూడా సహజమే.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News