Saturday, October 12, 2024
Homeఆంధ్రప్రదేశ్Peapully: అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు

Peapully: అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు

ప్రశాంతంగా ఉండమని ఖాకీల సలహా

జలదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో ఊటకొండ, మాధవరం, రామకృష్ణాపురం గ్రామాలలో ప్యాపిలి సిఐ వెంకట్రామిరెడ్డి, జలదుర్గం ఎస్సై నాగార్జున మరియు సిబ్బందితో కలిసి జలదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామాలలో అంగన్వాడి సెంటర్లు, స్కూల్స్ ను సందర్శించి విద్యార్థులకు గల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

- Advertisement -

అనంతరం ఆయా గ్రామాలలోని ప్రజలతో సమావేశం ఏర్పాటు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ గ్రామంలో ఎటువంటి అల్లర్లు, గొడవలు లేకుండా ప్రశాంతమైన జీవితం సాగించాలని, అలాగే గ్రామాల్లో బెల్ట్ షాపులు, నాటు సారా, మట్కా, గ్యాంబ్లింగ్ వంటి వాటిని నిర్వహించినట్లయితే వారిపై కఠిన చర్యలు తీసుకుని కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News