Monday, July 8, 2024
Homeఆంధ్రప్రదేశ్Peddakadaburu: తండ్రిని కాడెద్దుగా మార్చుకున్న కూతురు

Peddakadaburu: తండ్రిని కాడెద్దుగా మార్చుకున్న కూతురు

తండ్రి ఎద్దుగా మారి, కూతురితో సేద్యం చేస్తున్న దృశ్యం

రైతన్నల దుస్థితి చెప్పాలంటే ఈ ఒక్క ఫోటో చాలు కదా. ఓవైపు అసలే అరకొర వర్షాలు మరోవైపు వ్యవసాయ కూలీలు దొరకని స్థితి, ఇంకోవైపు కూలీలు దొరికినా వారికి చేతినిండా కూలీ డబ్బులు ఇచ్చే పరిస్థితి లేక చిన్న, సన్నకారు పేద రైతులు పడుతున్న అవస్థలకు ఈ ఫోటో నిలువెత్తు సాక్ష్యం.

- Advertisement -

కర్నూలు జిల్లా పెద్దకడబూరు మండల కేంద్రమైన పెద్దకడబూరులోనే బొగ్గుల జాన్ పొలంలో వ్యవసాయ పనులు చేసుకోవాలంటే ఎద్దుల బాడుగ విపరీతంగా పెరిగిపోవడంతో ఏం చేయాలో తెలియక తన కుటుంబ సభ్యులతో కలిసి పంట పొలం దున్నాడు. అరకొర వర్షాలకే పత్తి పంట చిగురించడంతో కలుపు మొక్కలు తీయాలంటే కూలీలు దొరకక, దిక్కు తోచని స్థితిలో ఇంటి యజమాని బొగ్గుల జాన్ తన పొలంలో కాడెద్దుగా మారి, కన్న కూతురే వ్యవసాయ కూలీగా సేద్యం చేయించడం అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది. ఈ సందర్భంగా కుటుంబ యజమాని బొగ్గుల జాన్ మాట్లాడుతూ..తన రెండెకరాల పొలంలో పత్తి పంటను కాపాడుకునేందుకు కాడెద్దులతో కలుపు మొక్కలను తొలగించాలంటే బాడిగ ఇవ్వలేక ఇలా కూలీగా మారినట్టు తన కష్టాలను చెప్పుకొచ్చాడు.

కూలీల రేటు కూడా అధికంగా ఉండడంతో దిక్కుతోచని స్థితిలో కుటుంబ యజమానిగా నేను కాడెద్దుగా మారి భార్య, కూతురితో సేద్యం చేసుకున్నామని రైతు తన కష్టాలను చెప్పటం అందరినీ కలిచివేస్తోంది. మాలాంటి రైతులను ప్రభుత్వాలు ప్రత్యేకంగా ఆదుకుంటేకానీ మా జీవితాలు బాగుపడవని రైతు జాన్ తన గోడు వెళ్లబోసుకున్నాడు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News