పెద్దకడబూరు మండల పరిధిలోని చిన్నతుంబలం గ్రామంలో నివాసముంటున్న కెపి.యల్లప్పకు
నార్మ్ సంస్థ 48వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రకృతి వ్యవసాయం, మిశ్రమ వ్యవసాయం ప్రోత్సాహించేలా ఏర్పాటు చేసిన రైతు సన్మాన కార్యక్రమంలో కేపి. యల్లప్పకు జాతీయ సంస్థ అయిన జాతీయ వ్యవసాయ పరిశోదనా నిర్వహణ సంస్థ (ICAR- నార్మ్ ) నుండి గుర్తింపు లభించింది. నార్మ్ సంస్థ డైరెక్టర్ సి. హెచ్. శ్రీనివాస రావు, ఐ.సీ. ఏ.ఆర్ మాజీ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ జె. సి.కాత్యాల్ ఆంధ్రప్రదేశ్ చెందిన కేపి.యల్లప్పకు.. ఇతర రైతులకు జ్ఞాపికను అందచేసారు. మిశ్రమ పంటలు వెయ్యటం వలన రైతులు మంచి లాభాలు పొందవచ్చని పురుగుమందులు లేని వ్యవసాయం దిశగా రైతులు అడుగువేయాలని సన్మాన గ్రహీత కేపీ.యల్లప్పను మంత్రాలయం ఎమ్మెల్యే. వై.బాలనాగిరెడ్డి రాష్ట్ర యువ నేత వై. ప్రదీప్ రెడ్డి,పెద్దకడుబూరు వ్యవసాయ సలహా మండలి చైర్మన్ పురుషోత్తం రెడ్డి, మండల కన్వీనర్ రామ్మోహనరెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, మండల వ్యవసాయ అధికారి యం.వర ప్రసాద్ అభినందించారు.
Peddakadaburu: యల్లప్పకు జాతీయస్థాయిలో సన్మానం
రైతును అభినందించిన ప్రముఖులు
సంబంధిత వార్తలు | RELATED ARTICLES