Friday, July 5, 2024
Homeఆంధ్రప్రదేశ్Peddakadaburu: వైభవంగా శివపార్వతుల రథోత్సవం

Peddakadaburu: వైభవంగా శివపార్వతుల రథోత్సవం

మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా..

పెద్దకడబూరు గ్రామంలో వెలసిన శ్రీశ్రీశ్రీ మల్లికార్జునస్వామి ఆలయంలో మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీ భ్రమరాంబికాదేవి మల్లికార్జునస్వాముల కళ్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది. శివపార్వతుల కళ్యాణ మహోత్సవాన్ని పురస్కరించుకొని ఆలయ పెద్దలు నరవ రమాకాంతరెడ్డి, నరవ విరూపాక్షిరెడ్డి, నరవ రాజశేఖర్ రెడ్డి, తిమ్మారెడ్డి, మధుసూదన్ రెడ్డి, రాఘవరెడ్డి, రంగారెడ్డి, మురళీధర్ రెడ్డి, సురేష్ రెడ్డి ఆధ్వర్యంలో శ్రీ భ్రమరాంబికా దేవి మల్లికార్జున స్వాముల రథోత్సవం అశేష భక్తవాహిని నడుమ రమణీయంగా సాగింది.

- Advertisement -

అంతకు ముందు ఆలయ అర్చకులు స్వాముల వారికి జలాభిషేకం, పుష్పాలంకరణ, పంచామృతాభిషేకంతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వాముల వారి రథాన్ని సుందరంగా పుష్పాలంకరణతో తీర్చిదిద్దారు. సాయంత్రం శ్రీ మల్లికార్జున స్వామి ఆలయం నుండి ఉత్సవ మూర్తులను మంగళవాయిద్యాలతో ఊరేగింపుగా తెచ్చి స్వామివారి రథంపై ప్రతిష్టించారు. ఆలయ పెద్ద నరవ రమాకాంతరెడ్డి ఇంటి నుండి పూర్ణకుంభం బ్యాండు మేళాలతో, డ్రమ్స్ లతో ఊరేగింపుగా రథం వద్దకు తెచ్చి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం శివపార్వతుల రథోత్సవం అశేష భక్తవాహిణి నడుమ గ్రామ పురవీధుల గుండా కన్నుల పండుగగా జరిగింది.

ఈ కార్యక్రమంలో వైసీపీ మండల కన్వీనర్ రామ్మోహన్ రెడ్డి,రోడ్డు అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్ చంద్రశేఖర్ రెడ్డి, గ్రామ సర్పంచ్ రామాంజనేయులు, మాజీ ఎంపీపీ రఘురామ్, మాజీ వీఆర్వోలు రామలింగారెడ్డి, నవీన్ రెడ్డి, కృష్ణమూర్తి, టీడీపీ నాయకులు ఏసేపు, మల్లికార్జున, మీ సేవ ఆంజనేయులు, ఎంజీ నరసన్న, రెయిన్ బో హై స్కూల్ కరస్పాండెంట్ గోవిందరెడ్డి, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News