పెద్దకడబూరు మండల పరిధిలోని కంబలదిన్నె గ్రామంలో స్థానిక అంగన్ వాడి-2 భవనం అర్ధాంతరంగా నిలిచిపోయిందని గ్రామ ప్రజలు పలువురు విమర్శలు కురిపిస్తున్నారు.2019 దాదాపు 80 లక్షలకు పైగా నిధులుతో భవన నిర్మాణం పనులు చేపట్టారని స్థానికులు వాపోతున్నారు. అయితే భవన నిర్మాణ పైకప్పు కూడా పూర్తయిందని ఇంతవరకు అంగన్ వాడి భవనముకు ప్లాస్టింగ్ మాత్రం ఇవ్వాల్సి ఉండగా ఇంతవరకు సంబంధిత అధికారులు ఈ అంగన్ వాడి సెంటర్ కనపడదా అని స్థానిక గ్రామ ప్రజలు విమర్శలు కురిపిస్తున్నారు. ఈ భవనానికి కిటికీలు, తలుపులు లేకపోవడంతో ఆ సాంఘిక కార్యకలాపాలకు నిలియంగా మారుతుందని, అలాగే అంగన్ వాడీ భవనం దాదాపు రెండున్నర ఏళ్ళు అవుతున్న ఇప్పటి వరకు భవన నిర్మాణం పనులు ఆసంపూర్తిగానే కనిపిస్తున్నాయని గ్రామ ప్రజలు అధికారులను కోరారు. నిధులు లేకపోవడం వలన సంబంధిత కాంట్రాక్టర్ భవన నిర్మాణం పనులు నిలిపివేశారని సమాచారం. ఇప్పటికైనా సంబంధిత అధికారులు వెంటనే స్పందించి అంగన్ వాడి భవన నిర్మాణం పనులను పూర్తిచేయాలని స్థానిక గ్రామ ప్రజలు అధికారులను కోరారు.
Peddakadaburu: ఈ అంగన్ వాడి భవనానికి మోక్షం ఎప్పుడో ?
అర్ధాంతరంగా నిలిచిపోయిన భవన నిర్మాణం
సంబంధిత వార్తలు | RELATED ARTICLES