పోల్యుషన్ కంట్రోల్ బోర్డు రీజనల్ ఆఫీస్, ల్యాబరేటరిను ప్రారంభించారు రాష్ట్ర విద్యుత్, అటవీ, పర్యావరణం, భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. భవనానికి డాక్టర్ వైఎస్సార్ పర్యావరణ భవనంగా నామకరణం చేశారు.
మొత్తం 16.50 కోట్లతో నిర్మించిన నూతన కార్యాలయ భవనం నిర్మించారు, 34 వేల చదరపు అడుగులతో నూతన భవన నిర్మాణం పూర్తి కాగా.. భవిష్యత్తు లో జోనల్ కార్యాలయం తిరుపతిలో ఏర్పాటు చేసినా ఇదే భవనం సరిపోయేలా నిర్మాణం చేయటం విశేషం.
ఎంపి గురుమూర్తి, పిసిబి మెంబర్ సెక్రెటరీ శ్రీధర్, ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సిఎం వైఎస్ జగన్ పర్యావరణం పై ప్రత్యేక శ్రద్ద తీసుకుని మార్పులు తెచ్చారని పెద్దిరెడ్డి వెల్లడించారు. కొత్త పరిశ్రమలు పెద్ద ఎత్తున రాష్ట్రం ఏర్పాటు చేస్తున్నారని, జూన్ నెలలో ఎన్నడూ లేని విధంగా 263.13 మిలియన్ మెగా వాట్ల విద్యుత్ వినియోగం పరిశ్రమల ఏర్పాటుకి నిదర్శనమన్నారు. ఎక్కడా కాలుష్యం లేకుండా కాలుష్య నియంత్రణ మండలి అనేక చర్యలు చేపట్టిందన్నారు మంత్రి. అధికారులు కోరినట్టుగా తిరుపతిలో జోనల్ కార్యాలయం ఏర్పాటు చేస్తామని పెద్దిరెడ్డి వెల్లడించారు.