చిరుత దాడులు జరగకుండా పటిష్ట చర్యలు చేపడుతున్నట్టు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. ఇటీవల చిరుత దాడిలో మృతి చెందిన చిన్నారి కు ప్రభుత్వం తరపున 5 లక్షలు ఎక్స్ గ్రేసియ అందించినట్టు మంత్రి పెద్దిరెడ్డి వెల్లడించారు. జరిగిన ఘటన చాలా బాధాకరమన్న ఆయన, ఇప్పటి వరకు దొరికిన రెండు చిరుతలు జూ పార్క్ లోనే ఉంచుతామన్నారు, శాశ్వత ప్రాతపదికన కంచే ఏర్పాటు చేసే దిశగా టిటిడి, అటవీ శాఖ ఆలోచన చేస్తోందన్నారు. టిటిడి పరిధిలోని అటవీప్రాంతం లో సంఘటన జరిగిందని, ప్రభుత్వం తరపున పూర్తి స్థాయిలో టిటిడి కు సహకరిస్తామన్నారు. ఎక్కడా కూడా సిబ్బంది కొరత లేదని, అవసరమైన మేరకు సిబ్బందిని అందుబాటులో ఉంచుతామన్నారు. టిటిడి దేవస్థానం నివేదిక వచ్చిన తర్వాత తదుపరి కార్యాచరణ ఉంటుందన్నారు పెద్దిరెడ్డి.
