Thursday, January 30, 2025
Homeఆంధ్రప్రదేశ్Peddireddy: టీడీపీ కార్యకర్తలకు పెద్దిరెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

Peddireddy: టీడీపీ కార్యకర్తలకు పెద్దిరెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

తెలుగుదేశం(TDP) పార్టీ కార్యకర్తలకు మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి(Peddireddy Ramchandra Reddy) సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. కడప, రాయచోటిలో నిర్వహించిన వైసీపీ సమన్వయ సమావేశానికి పెద్దిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో జగన్‌ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని ధీమా వ్యక్తం చేశారు. జగన్ సీఎం కాగానే టీడీపీ కార్యకర్తల భరతం పడతామని హెచ్చరించారు.

- Advertisement -

వైసీపీ నాయకులు, కార్యకర్తల మీద కేసులు పెట్టి ఇబ్బంది పెడుతున్నారని కూటమి ప్రభుత్వంపై మండిపడ్డారు. సోషల్ మీడియా కార్యకర్తలతో పాటు గ్రామస్థాయిలో కూడా వైసీపీ కార్యకర్తలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. 2029లో జరిగే ఎన్నికల్లో జగన్‌ మళ్లీ సీఎం అవుతారని.. అప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల భరతం పడతామని బహిరంగ హెచ్చరికలు జారీ చస్త్రశారు. వైసీపీ కార్యకర్తలపై చేసిన దాడులకు ప్రతి దాడులు కచ్చితంగా ఉంటాయన్నారు. జగన్‌ సీఎం అయ్యాక వైసీపీ నేతల తడాఖా ఏంటో రుచి చూపిస్తామన్నారు. ఎవరికీ భయపడాల్సిన పనిలేద అని పెద్దిరెడ్డి వెల్లడించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News