Penna River Rescue : నెల్లూరు జిల్లాలోని భగత్ సింగ్ నగర్ వద్ద సోమవారం రాత్రి ఒక ఉత్కంఠభరిత ఘటన చోటుచేసుకుంది. పేకాట ఆడేందుకు పెన్నా నది మధ్యలోకి వెళ్లిన 17 మంది యువకులు సోమశిల ప్రాజెక్టు నుంచి నీరు విడుదల కావడంతో ఒక్కసారిగా పెరిగిన ప్రవాహంలో చిక్కుకుపోయారు. నదిలో నీటి మట్టం హఠాత్తుగా పెరగడంతో భయాందోళనకు గురైన యువకులు కేకలు వేస్తూ స్థానికులను అప్రమత్తం చేశారు. వారి అరుపులు విన్న స్థానికులు వెంటనే అధికారులకు సమాచారం అందించారు.
పెన్నా నదిలో చిక్కుకున్న 14 మంది యువకులు.
పేకాట ఆడేందుకు వెళ్లి నదిలో చిక్కుకుపోయిన యువకులు. పెన్నా నది వాగులో ఒక్కసారిగా చుట్టుముట్టిన వరద నీరు. నదిలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు అధికారుల ప్రయత్నం. నెల్లూరులోని భగత్ సింగ్ కాలనీ దగ్గర ఘటన. ఘటనపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్న… pic.twitter.com/k15wdzKmTX
— Telugu Stride (@TeluguStride) September 16, 2025
ALSO READ: OG Movie: హై వోల్టేజ్ బీట్స్‌తో ‘గన్స్ ఎన్ రోజెస్’
అగ్నిమాపక శాఖ, నవాబుపేట పోలీసులు, రెవెన్యూ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. రాత్రి సమయంలో బ్రిడ్జి కింద చీకటిగా ఉండటంతో, అధికారులు లైట్లు ఏర్పాటు చేసి రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారు. బ్రిడ్జి పైనుంచి నిచ్చెన వేసి 9 మంది యువకులను సురక్షితంగా పైకి తీసుకొచ్చారు. అయితే, కొంతమంది యువకులు పోలీసులు కేసు నమోదు చేస్తారనే భయంతో వరద నీళ్లలోనే పరుగులు పెట్టారు.
వరద తగ్గిన తర్వాత మిగతా యువకులు నది నుంచి బయటపడి ఉంటారని అధికారులు భావిస్తున్నారు. అయినప్పటికీ, రాత్రంతా నదిలో గాలింపు చర్యలు కొనసాగించారు. పోలీసు కేసు భయంతో కొందరు దాక్కుని ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. ఈ ఘటన స్థానికుల్లో తీవ్ర కలకలం రేపింది. నది ప్రవాహం ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండాలని, అనవసరంగా నదిలోకి వెళ్లడం ప్రమాదకరమని అధికారులు హెచ్చరించారు. సోమశిల ప్రాజెక్టు నుంచి నీరు విడుదల సమయంలో సమాచారం అందించే వ్యవస్థను మెరుగుపరచాలని స్థానికులు కోరుతున్నారు.


