వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని(Perni Nani) ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. రేషన్ బియ్యం మాయం కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఇవాళ న్యాయస్థానంలో విచారణ జరిగే అవకాశముంది. ఈ కేసులో నానిని ఏ6 నిందితుడిగా చేరుస్తూ బందర్ తాలుకా పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే.
ఇప్పటికే ఇదే కేసులో నలుగురు నిందితులు సివిల్ సప్లై అసిస్టెంట్ మేనేజర్ కోటిరెడ్డి, గోడౌన్ మేనేజర్ మానస తేజ, డీలర్ ఆంజనేయులు, లారీ డ్రైవర్ మంగారావులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారికి మచిలీపట్నం స్పెషల్ మొబైల్ జడ్జి రిమాండ్ విధించారు. దీంతో నిందితులను మచిలీపట్నం సబ్‌జైలుకు తరలించారు. ఈ నేపథ్యంలో తనను అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ ఆయన హైకోర్టులో పిటిషన్ వేశారు.
మరోవైపు ఏ1గా ఉన్న నాని భార్య జయుసుధకు మచిలీపట్నం కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. అయితే పోలీసుల విచారణకు హాజరుకావాలని స్పష్టం చేసింది.