పీటర్ నవారో చేసిన వ్యాఖ్యలు అమెరికా భారత్ మధ్య వాణిజ్య, ఆర్థిక సంబంధాలలో కొత్త దిశను సూచిస్తున్నాయి. ఆయన భారత ప్రధాని మోదీపై సూటిగా విమర్శలు చేయడమే కాకుండా.. రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో భారత్ పాత్రను “Modi’s War” అంటూ సంచలన కామెంట్స్ చేశారు. భారత్ రష్యా నుంచి తక్కువ ధరకు చమురు కొనడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. దీని వల్ల మోస్కోకు ఫైనాన్షియల్ సహాయమిచ్చినట్లేనని.. భారత్ చేస్తున్న ఈ పని పరోక్షంగా పన్నులు కడుతున్న అమెరికన్లు నష్టపోయారని అన్నారు.
Janasena : వ్యూహాలకు పదును పెట్టిన పవన్ కల్యాణ్
భారత అధికారులు ‘తాము ఎవరి నుంచైనా చమురు కొనవచ్చు అనటాన్ని నవారో తప్పుపట్టారు. ఇది తమ వాణిజ్య హక్కు అనటం సరికాదన్నారు. ఇది తాను అంగీకరించనని అభిప్రాయపడ్డారు. ఇండియా రష్యా నుంచి చమురు కొనడం ఆపితే వెంటనే 25% టారిఫ్ తగ్గుతుందని నవారో అన్నారు. ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధించిన 50% టారిఫ్ భారత దిగుమతులకు అమలులో ఉంది. మరోపక్క ఆగస్టు 27 నుంచి వాణిజ్య సుంకాలు అమలులోకి రావటంతో.. భారత ఎగుమతుల్లో 65 శాతానికి పైగా ప్రభావం చూపిస్తాయని ఆందోళనలు పెరుగుతున్నాయి.
ఇండియా వల్ల అమెరికా ట్యాక్స్ పేయర్లు, కార్మికులు, వ్యాపారాలు నష్టపోతున్నారని నవారో ఆరోపించారు. రష్యా చమురు కొనుగోలు ద్వారా క్రెమ్లిన్‌కు డబ్బు అందుతోందని, అదే ఉక్రెయిన్ పై యుద్ధానికి దోహదపడుతోందని అన్నారు. దీనిలో “Modi’s war” అని పేర్కొన్నది భారత నైతిక బాధ్యతను సూచించేలా ఉంది. మరోపక్క భారత్ మాత్రం ఎనర్జీ సెక్యూరిటీ ముఖ్యమని, తక్కువ ధరకు చమురు కొనడం దేశీయ ఇంధన ధరలను నిర్దేశించడంలో సహాయపడిందని వాదిస్తోంది.
నవారో తాజాగా చేసిన కామెంట్స్ అమెరికా, భారత సంబంధాలు, వాణిజ్య నిబంధనలు, రాజకీయ పరస్పర అనుబంధాలు పై పెద్ద ప్రభావాన్ని చూపుతాయని నిపుణులు అంటున్నారు. ఆయన మాటాల్లో అమెరికా వైపు ఉన్న కోపం, నిరాశ, భద్రతాపరమైన ఆందోళనలు స్పష్టంగా కనిపిస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. అయితే అమెరికా భారత్ మధ్య ద్వైపాక్షిక చర్చలు వేగవంతం చాలా ముఖ్యమని, ఇది ఇరుదేశాలను ప్రభావితం చేస్తాయని చెబుతున్నారు.


