రాజమహేంద్రవరంలో ఫార్మసీ విద్యార్ధిని అంజలి(Anjali) ఆత్మహత్యాయత్నం చేసుకున్న విషయం తెలిసిందే. అంజలి కుటుంబం వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్(Jagan)ను తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో కలిసింది. తమ కుమార్తెకు జరిగిన అన్యాయాన్ని జగన్‌కు వివరించింది. తమ కుమార్తె ఆత్మహత్యాయత్నానికి కారణమైన వారిని కఠినంగా శిక్షించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని విజ్ఞప్తి చేసింది. దీంతో అంజలి కుటుంబానికి న్యాయం జరిగే వరకూ పూర్తిగా అండగా ఉంటానని ఆయన ధైర్యం చెప్పారు. ఈమేరకు అవసరమైన పూర్తి న్యాయ సహాయం అందిస్తామని జగన్ భరోసా ఇచ్చారు. బాధిత కుటుంబం వెంట మాజీ ఎంపీ భరత్, ఎమ్మెల్సీ కళ్యాణి, ఇతర నేతలు ఉన్నారు.
