Monday, December 9, 2024
Homeఆంధ్రప్రదేశ్Tirumala: తిరుమలలో వైసీపీ ఎంపీ అనుచరుడు హల్‌చల్

Tirumala: తిరుమలలో వైసీపీ ఎంపీ అనుచరుడు హల్‌చల్

Tirumala| తిరుమల శ్రీవారి ఆలయం ముందు వైసీపీ నేత హల్ చల్ చేశాడు. కడప వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి(YS Avinash Reddy) అనుచరుడు వంశీధర్‌ రెడ్డి ఫొటోల పేరుతో హంగామా సృష్టించాడు. నలుగురు వ్యక్తిగత ఫొటోగ్రాఫర్లతో ఆలయ ప్రాంగణంలో ఫొటోషూట్ నిర్వహించాడు. ఇంత హంగామా జరుగుతున్నా టీటీడీ విజిలెన్స్ సిబ్బంది మాత్రం పట్టించుకోలేదు. దీంతో వంశీధర్ రెడ్డి తీరుపై భక్తులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. మరోవైపు ఆయన వ్యక్తిగత సిబ్బంది కూడా మీడియాపై దురుసుగా ప్రవర్తించారు.

- Advertisement -

కాగా గతంలో ఇలాంటి ఘటనలకు పాల్పడిన వైసీపీ నేతలపై విజిలెన్స్ సిబ్బంది, పోలీసులు కేసులు పెట్టగా.. ఇప్పుడు మాత్రం ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పవిత్రమైన శ్రీవారి ఆలయ ప్రాంగణంలో భక్తులకు అసౌకర్యం కలిగిస్తూ ఫొటోషూట్ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News