ఏపీ అసెంబ్లీ(AP Assembly) బడ్జెట్ సమావేశాలు ఇవాళ ఉదయం ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగం చేశారు. అంతకుముందు అసెంబ్లీకి చేరుకున్న గవర్నర్‌కు సీఎం చంద్రబాబు, స్పీకర్ అయ్యన్నపాత్రుడు, మండలి ఛైర్మన్ మోషేన్ రాజు, స్వాగతం పలికారు.
- Advertisement -






సభకు ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు.





ఈసారి సమావేశాలకు వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా సభకు వచ్చారు. ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం జగన్ కూడా సభలో పాల్గొన్నారు. అయితే గవర్నర్ ప్రసంగం సమయంలో ప్రతిపక్షాన్ని గుర్తించి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటూ స్పీకర్ పోడియం వద్ద నినాదాలు వైసీపీ సభ్యులు.. కాసేపటి తర్వాత సభ నుంచి వాకౌట్ చేశారు.

