Homeఆంధ్రప్రదేశ్Kosigi: కోసిగిలో పందుల స్వైరవిహారం

Kosigi: కోసిగిలో పందుల స్వైరవిహారం

బస్టాండు వెనుక ప్రధాన రోడ్డుపై గుంపులు గుంపులుగా సంచారం..

- Advertisement -

కాలనీల్లో ఇళ్లలోకి వస్తున్న పందులు.. పట్టించుకోని పంచాయతీ అధికారులు

కోసిగి, తెలుగుప్రభ: కోసిగి మండల కేంద్రంలో పందుల బెడద రోజురోజుకూ తీవ్రతరమవుతోంది. ప్రధాన రహదారులు, కాలనీల్లో పందులు గుంపులు గుంపులుగా సంచరిస్తుండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఆర్టీసీ బస్టాండు వెనుక భాగంలోని ప్రధాన రోడ్డుపై పందులు స్వైరవిహారం చేస్తున్నాయి. పోలీస్‌స్టేషన్‌ సమీపంలోనూ పందుల సంచారం అధికంగా ఉందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కోసిగిలోని రామకమ్మవ్వ కాలనీలో అయ్యప్పస్వామి దేవాలయం రోడ్డులో, చర్చి సమీపంలో పందులు విచ్చలవిడిగా తిరుగుతున్నాయని కాలనీవాసులు తెలిపారు. పందులు ఇళ్లలోకి సైతం వస్తుండడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. పందుల బెడదతోపాటు దోమల ఉధృతి పెరగడంతో ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.

ఆర్టీసీ బస్టాండు వెనుక ప్రాంతం, పోలీస్‌స్టేషన్‌ సమీపంలోని ఇంటిగ్రేటెడ్‌ హాస్టల్‌, అన్న క్యాంటీన్‌, అంగన్‌వాడీ కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలల పరిసరాల్లో పందుల సంచారం అధికంగా ఉందని స్థానికులు పేర్కొన్నారు. విద్యార్థులు, చిన్నారులు, ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.

ఇప్పటికైనా సంబంధిత పంచాయతీ అధికారులు స్పందించి కోసిగిలో పందుల బెడదను నివారించేందుకు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News