హిందూవుల పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమల(Tirumala)లో మరోసారి విమానం చక్కర్లు కొట్టింది. గురువారం ఉదయం ఓ విమానం శ్రీవారి ఆలయానికి సమీపంలో వెళ్లింది. భక్తులు విమానం వెళ్లే సమయంలో వీడియో తీశారు. ఆగమశాస్త్రం ప్రకారం తిరుమలలో విమానాలు వెళ్లకూడదు. అయినా కానీ తరుచూ శ్రీవారి ఆలయం సమీపంలో నుంచి విమానాలు, హెలికాఫ్టర్లు వెళ్లడంపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఈ సమస్యపై టీటీడీ అధికారులు గతంలోనే కేంద్ర పౌరవిమానయాన శాఖ దృష్టికి తీసుకెళ్లారు. తిరుమలను నో ఫ్లై జోన్‌గా ప్రకటించాలని కోరారు. అయితే నో ఫ్లై జోన్ నిబంధన అమలు చేయడం వీలుకాదని కేంద్రం తెలిపింది. ఇటీవల రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత కూడా తిరులమను నో ఫ్లై జోన్‌గా ప్రకటించే దిశగా ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు. ఇప్పటికైనా కేంద్రంతో సంప్రదింపులు జరిపి పవిత్రమైన తిరుమలలో విమానాలు ఎగరకుండా చూడాలని భక్తులు కోరుతున్నారు.