Saturday, November 15, 2025
Homeఆంధ్రప్రదేశ్PM Modi: చంద్రబాబు హిందీ ప్రసంగానికి మోదీ ఫిదా.. ఎక్స్‌లో వీడియో పోస్ట్‌

PM Modi: చంద్రబాబు హిందీ ప్రసంగానికి మోదీ ఫిదా.. ఎక్స్‌లో వీడియో పోస్ట్‌

PM Modi congratulate for CM Chandrababu Hindi Speech: ఈ రోజు కర్నూలులో పీఎం నరేంద్ర మోదీ పర్యటించిన విషయం తెలిసిందే. శ్రీశైలం భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి వారి దర్శనం అనంతరం ఆయన కర్నూలులో నిర్వహించిన సూపర్‌ జీఎస్టీ- సూపర్‌ సేవింగ్స్‌ సభలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు హిందీలో ప్రసంగించారు. ఈ ప్రసంగానికి ప్రధాని మోదీ ఫిదా అయ్యారు. ఈ మేరకు ‘X’లో పోస్ట్‌ చేశారు. 

- Advertisement -

బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే విజయం సాధిస్తుందని… ప్రధాని మోదీ విజయ యాత్ర కొనసాగుతుందంటూ చంద్రబాబు హిందీలో ప్రసగించారు. ఈ స్పీచ్‌కి మురిసిపోయిన ప్రధాని మోదీ.. ప్రత్యేకంగా ఆ వీడియో క్లిప్‌ను ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు హిందీలో బాగా మాట్లాడారంటూ ప్రధాని పొగిడారు. ఈ ప్రసంగం ద్వారా సీఎం చంద్రబాబు బిహార్‌లో ఎన్డీయే కార్యకర్తల హృదయాలను గెలుచుకున్నారన్నారు. అంతేకాకుండా ‘ఏక్‌ భారత్‌.. శ్రేష్ఠ భారత్‌’ పట్ల తన ప్రగాఢ నిబద్ధతను ప్రదర్శించారని మోదీ కొనియాడారు. 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad