Saturday, November 15, 2025
Homeఆంధ్రప్రదేశ్PM Modi: నేను ఏపీకి వస్తున్నాను.. శ్రీశైలంలో ప్రార్థనలు చేస్తా: ప్రధాని మోదీ

PM Modi: నేను ఏపీకి వస్తున్నాను.. శ్రీశైలంలో ప్రార్థనలు చేస్తా: ప్రధాని మోదీ

PM Modi Andhra Pradesh tour: ఆంధ్రప్రదేశ్‌ పర్యటన నేపథ్యంలో ప్రధాని మోదీ ఆసక్తికర ట్వీట్ చేశారు. తన పర్యటన విశేషాలను తెలుగులో పోస్ట్ చేశారు. ‘‘అక్టోబర్‌ 16న నేను ఆంధ్రప్రదేశ్‌లో ఉంటాను. శ్రీశైలంలోని శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్ల దేవస్థానంలో పూజలు చేస్తాను. ఆ తర్వాత కర్నూలులో రూ.13,400 కోట్లకు పైగా విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తాను పలు ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొంటాను. ఈ పనులు విద్యుత్‌, రైల్వేలు, పెట్రోలియం, రక్షణ, పరిశ్రమలతో పాటు మరిన్ని రంగాలకు సంబంధించినవి’’ అని ‘సోషల్‌ మీడియాలో ప్రధాని తెలిపారు.

- Advertisement -

నేడు ఏపీకి రానున్న పీఎం మోదీ: ప్రధాని మోదీ వాయుసేన విమానంలో దిల్లీ నుంచి బయలుదేరి ఉదయం 9.55 గంటలకు కర్నూలు చేరుకోనున్నారు. అక్కడినుంచి నేరుగా సైనిక హెలికాప్టర్‌లో శ్రీశైలం వెళ్లనున్నారు. భ్రమరాంబ, మల్లికార్జున స్వామివార్లను దర్శించుకుని పలు పూజలు నిర్వహిస్తారు. అనంతరం అక్కడి నుంచి మధ్యాహ్నం 2.20కి కర్నూలు సభకు చేరుకుంటారు. జీఎస్టీ సభలో ప్రసంగించిన తర్వాత కర్నూలు విమానాశ్రయం నుంచి సాయంత్రం 4.45కు దిల్లీ బయల్దేరి వెళ్తారు.

పీఎం పర్యటనపై సీఎం సమీక్ష: నేడు పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ప్రధాని మోదీ ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించనున్నారు. అంతే కాకుండా శ్రీశైలంలో పూజలు చేస్తారు. దీంతో సీఎం చంద్రబాబు ప్రధాని పర్యటనపై సమీక్ష నిర్వహించారు. శ్రీశైలంలో చేసిన ఏర్పాట్లపై చంద్రబాబు విజయవాడ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు. ప్రధాని కార్యక్రమ ప్రత్యేకాధికారి వీరపాండియన్, కర్నూలు జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.సిరి తదితరులతో వివరాలను ఆరాతీశారు. మంత్రులు పీ నారాయణ, బీసీ జనార్దన్‌రెడ్డి, రవికుమార్, రాంప్రసాద్‌రెడ్డి, సత్యప్రసాద్, అచ్చెన్నాయుడు, అనిత ఏర్పాట్లను పరిశీలించారు. ఏపీ డీజీపీ హరీశ్‌కుమార్‌ గుప్తా సభా ప్రాంగణంలో భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు.

జీఎస్టీ 2.0పై కర్నూలులో సభ: కేంద్రం ప్రవేశపెట్టిన జీఎస్టీ 2.0 సంస్కరణలతో ప్రజలకు కలిగే ప్రయోజనాలను వివరించి చెప్పేందుకు వస్తున్న పీఎం మోదీకి భారీ స్వాగతం పలికేందుకు కర్నూలు నగరం సిద్ధమైంది. ‘సూపర్‌ జీఎస్టీ- సూపర్‌ సేవింగ్స్‌’ పేరుతో గురువారం జరిగే బహిరంగసభకు సుమారు మూడు లక్షల మంది హాజరవుతారని ఏపీ ప్రభుత్వం అంచనా వేసింది. ఈ సభకు కర్నూలు శివారులోని నన్నూరు వేదిక కానుంది. ఇక్కడ సుమారు 450 ఎకరాల్లో సభ నిర్వహణకు ఏర్పాట్లుచేశారు. వర్షం వచ్చినా ఇబ్బంది లేకుండా 40 ఎకరాల్లో 4భారీ టెంట్లు వేశారు. ఇక్కడి నుంచే ప్రధాని నరేంద్రమోదీ రూ.13,400 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad