Sunday, January 5, 2025
Homeఆంధ్రప్రదేశ్PM Modi: ఈనెల 8న ఏపీకి ప్రధాని మోదీ

PM Modi: ఈనెల 8న ఏపీకి ప్రధాని మోదీ

భారత ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఏపీ పర్యటన ఖరారైంది. ఈనెల 8న ఆయన రాష్ట్రానికి రానున్నట్లు అధికారులకు పీఎంవో నుంచి సమాచారం అందింది. 8వ తేదీ ఉదయం ఢిల్లీ నుంచి విశాఖ ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. అనంతరం నేరుగా ఆంధ్రా యూనివర్సిటీ ఇంజినీరింగ్‌కళాశాలకు వెళ్లనున్నారు.

- Advertisement -

అనకాపల్లి జిల్లా పుడిమడకలో ఎన్టీపీసీ(NTPC), ఏపీ జెన్ కో జాయింట్‌గా నెలకొల్పనున్న గ్రీన్ హైడ్రోజన్ హబ్‌(Green Hydrogen Hub), నక్కపల్లిలో మిట్టల్ స్టీల్ ప్లాంట్(Mittal Steel Plant) నిర్మాణం, విశాఖలో రైల్వేజోన్ పరిపాలన భవనాలకు వర్చువల్‌గా శంకుస్థాపన చేయనున్నారు. తర్వాత ప్రజలను ఉద్దేశించి బహిరంగ సభలో ప్రసంగించనున్నారు.

ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు(Chandrababu), డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్(Pawan Kalyan), పలువురు కేంద్ర, రాష్ట్ర మంత్రులు పాల్గొననున్నారు. ఈమేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News