PM Modi| ప్రధాని మోదీ ఈనెల 29న ఏపీ పర్యటనకు రానున్నారు. గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి కోసం ఎన్టీపీసీ(NTPC) సంస్థ ముందుకు వచ్చింది. ఇందులో భాగంగా గ్రీన్ అమ్మెనియా, గ్రీన్ హైడ్రోజెన్ ప్రాజెక్టుకు మోదీ శంకుస్థాపన చేయనున్నారు. మొత్తం రూ.84,700 వేల కోట్ల పెట్టుబడితో ఈ ప్రాజెక్టులు పెట్టనున్నారు. గ్రీన్ హైడ్రోజన్ హబ్‌లో 20 గిటావాట్‌ల విద్యుత్తును ఎన్టీపీసీ ఉత్పత్తి చేయనుంది.
ఈ ప్రాజెక్టుల కోసం రాష్ట్ర ప్రభుత్వం విశాఖపట్టణంలో ఇప్పటికే 1200 ఎకరాలు కేటాయించింది. గురువారం అసెంబ్లీలో క్లీన్ ఎనర్జీపై చర్చ సందర్భంగా సీఎం చంద్రబాబు ప్రధాని ఏపీ పర్యటన గురించి తెలిపారు. ఈ రెండు ప్రాజెక్టులను ఏపీ జెన్‌కో, ఎన్టీపీసీ 50: 50 భాగస్వామ్యంతో నిర్మిస్తాయని వెల్లడగించారు. ప్రాజెక్టుల వల్ల వచ్చే నాలుగు సంవత్సరాల్లో 48వేల మందికి ఉపాధా అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు.